Vivo T5 Pro 5G launch announced with 9020 mAh huge battery
Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి వివో ప్రస్తావించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజర్ చూస్తుంటే మొబైల్ ప్రియులకు పండగే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 9020 mAh అతి భారీ బ్యాటరీతో లాంచ్ చేయబోతున్నట్లు వివో టీజర్ లో వెల్లడించింది. ఇప్పటికే టి సిరీస్ నుంచి అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను అందించిన వివో, ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది.
వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అంటే, “Coming Soon” ట్యాగ్ తో టీజింగ్ చేసింది. ఈ టీజర్ నుంచి ఈ ఫోన్ ప్రత్యేకత వివరిస్తూ టీజ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ ను ఈ నెల చివరిలోగా మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త కాంపాక్ట్ రూపంలో అందించే అవకాశం ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ లో అందించిన టీజర్ ఇమేజ్ చెబుతోంది. ఈ ఫోన్ కూడా టర్బో ఫోన్ గా ఇండియాలో అడుగుపెడుతుంది. ఈ ఫోన్ 120 FPS గేమింగ్ సపోర్ట్ చేసే చిప్ సెట్ మరియు స్క్రీన్ కలిగి ఉంటుందని ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ లో వెల్లడించింది.
ఇక మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను 9,020 mAh అతి భారీ బ్యాటరీతో ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఎక్కువ సహాయం ఫోన్ ను నిలిపి ఉంచుతుందని కూడా వివో తెలిపింది.
ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. వివో స్మార్ట్ ఫోన్ లెగసీ ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఈ అప్ కమింగ్ ఫోన్ ఉంటుందని కూడా వివో ఈ ఫోన్ గురించి గర్వంగా చేస్తోంది.
Also Read: OnePlus Nord 6 లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్ అండ్ ఫీచర్స్.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా వివో త్వరలో వెల్లడిస్తుంది. ఈ ఫోన్ న్యూ అప్‌డేట్ తో మళ్ళీ కలుద్దాం.