Vivo T5 Pro 5G :వివో 9020 mAh అతి భారీ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది.!

HIGHLIGHTS

Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి వివో ప్రస్తావించింది

కంపెనీ అందించిన టీజర్ చూస్తుంటే మొబైల్ ప్రియులకు పండగే అనిపిస్తుంది

9020 mAh అతి భారీ బ్యాటరీతో లాంచ్ చేయబోతున్నట్లు వివో టీజర్ లో వెల్లడించింది

Vivo T5 Pro 5G :వివో 9020 mAh అతి భారీ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవుతోంది.!

Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ గురించి వివో ప్రస్తావించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కంపెనీ అందించిన టీజర్ చూస్తుంటే మొబైల్ ప్రియులకు పండగే అనిపిస్తుంది. ఎందుకంటే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 9020 mAh అతి భారీ బ్యాటరీతో లాంచ్ చేయబోతున్నట్లు వివో టీజర్ లో వెల్లడించింది. ఇప్పటికే టి సిరీస్ నుంచి అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లను అందించిన వివో, ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5 Pro 5G : లాంచ్ డేట్ ఏమిటి?

వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అంటే, “Coming Soon” ట్యాగ్ తో టీజింగ్ చేసింది. ఈ టీజర్ నుంచి ఈ ఫోన్ ప్రత్యేకత వివరిస్తూ టీజ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ ఫోన్ ను ఈ నెల చివరిలోగా మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Vivo T5 Pro 5G : ఫీచర్స్

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను సరికొత్త కాంపాక్ట్ రూపంలో అందించే అవకాశం ఉన్నట్లు ఈ ఫోన్ టీజర్ లో అందించిన టీజర్ ఇమేజ్ చెబుతోంది. ఈ ఫోన్ కూడా టర్బో ఫోన్ గా ఇండియాలో అడుగుపెడుతుంది. ఈ ఫోన్ 120 FPS గేమింగ్ సపోర్ట్ చేసే చిప్ సెట్ మరియు స్క్రీన్ కలిగి ఉంటుందని ఈ ఫోన్ కోసం అందించిన టీజర్ లో వెల్లడించింది.

Vivo T5 Pro 5G

ఇక మెయిన్ ఫీచర్ విషయానికి వస్తే, వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ ను 9,020 mAh అతి భారీ బ్యాటరీతో ఇండియాలో విడుదల చేస్తున్నట్లు వివో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ లో ఉన్న బ్యాటరీ ఎక్కువ సహాయం ఫోన్ ను నిలిపి ఉంచుతుందని కూడా వివో తెలిపింది.

ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. వివో స్మార్ట్ ఫోన్ లెగసీ ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఈ అప్ కమింగ్ ఫోన్ ఉంటుందని కూడా వివో ఈ ఫోన్ గురించి గర్వంగా చేస్తోంది.

Also Read: OnePlus Nord 6 లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్ అండ్ ఫీచర్స్.!

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు కూడా వివో త్వరలో వెల్లడిస్తుంది. ఈ ఫోన్ న్యూ అప్‌డేట్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo