OnePlus Nord 6 లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్ అండ్ ఫీచర్స్.!

HIGHLIGHTS

OnePlus Nord 6 స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్

ఈ ఫోన్ ను అల్టిమేట్ ఆల్ రౌండర్ ఫోన్ గా మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది

ఇప్పుడు ఆన్‌లైన్ లో లీకైన ఈ ఫోన్ లీక్డ్ స్పెక్స్ చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది

OnePlus Nord 6 లాంచ్ కంటే ముందే లీకైన ప్రైస్ అండ్ ఫీచర్స్.!

OnePlus Nord 6 స్మార్ట్ ఫోన్ రేపు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుండగా, ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ మరియు ఫీచర్లు ఇప్పుడు ఆన్‌లైన్ లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ ను అల్టిమేట్ ఆల్ రౌండర్ ఫోన్ గా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ చాలా కాలంగా టీజింగ్ చేస్తోంది. ఇప్పుడు ఆన్‌లైన్ లో లీకైన ఈ ఫోన్ లీక్డ్ స్పెక్స్ చూస్తుంటే ఆ మాట నిజమే అనిపిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Nord 6 : లీక్డ్ ప్రైస్

వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ను మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేస్తుందని ముందు నుంచే అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఆ అంచనాలకు ఊతమిచ్చేలా ఈ ఫోన్ పై వచ్చిన కొత్త లీక్స్ కనిపిస్తున్నాయి. అదేమిటంటే, వన్ ప్లస్ ఈ ఫోన్ ను రూ. 35,000 నుంచి రూ. 40,000 రూపాయల ఆఫర్ ధరలో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేసి చెబుతున్నాయి.

ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుంది కాబట్టి, ఈ ఫోన్ ప్రైస్ పై పూర్తి క్లారిటీ వస్తుంది. ఈ లీక్స్ లో నిజం ఎంత ఉందో కూడా రేపు తెలుస్తుంది.

OnePlus Nord 6 : స్పెక్స్

వన్ ప్లస్ నార్డ్ 6 స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఫస్ట్ 9000 mAh బ్యాటరీ ఫోన్ గా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో అందించిన ఈ బిగ్ బ్యాటరీని సైతం వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ఈ ఫోన్ లో ఉంటుంది. ఈ ఫోన్ 165Hz గొప్ప రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి.

OnePlus Nord 6

ఈ ఫోన్ ట్రిపుల్ చిప్ సెట్ తో లంచ్ అవుతున్నట్లు వన్ ప్లస్ మొదటి నుంచి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s జెన్ 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అలాగే, నెట్ వర్క్ కోసం G2 Wi-Fi చిప్ మరియు డిస్ప్లే కోసం ప్రత్యేకమైన టచ్ రిఫ్లెక్స్ చిప్ కూడా ఈ ఫోన్ లో ఉంటాయి. ఈ ఫోన్ లో 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB (UFS 4.1) ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటాయి. టోటల్ గా ఈ ఫోన్ పవర్ ప్యాక్ గా వస్తుంది.

Also Read: REDMI Note 15 SE 5G: భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఫస్ట్ సేల్ కి సిద్ధమైన రెడ్ మీ ఫోన్.!

కెమెరా పరంగా కూడా ఈ ఫోన్ గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ యాక్సిస్ OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్స్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ తో గొప్ప ఫోటోలు మరియు 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ తో గొప్ప ఫోటోలు అందిస్తుందని వన్ ప్లస్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ ఇండస్ట్రీ లీడింగ్ IP66, 68,69 మరియు IP69K మిలటరీ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo