Vivo T5 Pro 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసిన వివో.!

HIGHLIGHTS

Vivo T5 Pro 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ను వివో రిలీజ్ చేసింది

అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు రివీల్ చేసింది

ఈ ఫోన్ 9020 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతోందని వివో టీజింగ్ తో అదరగొడుతోంది

Vivo T5 Pro 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ ను వివో రిలీజ్ చేసింది. అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అందించిన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ వివరాలు రివీల్ చేసింది. ముందుగా ఈ ఫోన్ బ్యాటరీ గురించి టీజింగ్ చేసిన వివో, ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ఒక్కొక్క కీలక ఫీచర్ ను విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈ ఫోన్ ను ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఎప్పుడు చూడని 9020 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతోందని వివో టీజింగ్ తో అదరగొడుతోంది.

Vivo T5 Pro 5G లాంచ్ డేట్?

వివో టి ప్రో స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీ నుండి ఈ ఫోన్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్లు కూడా ఈ పేజీ నుంచి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.

Vivo T5 Pro 5G : ఫీచర్స్

వివో టి5 ప్రో స్మార్ట్ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కన్పిస్తోంది. అయితే, ఈ ఫోన్ లో భారీ 9020 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ విషయాన్ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ పెద్ద బ్యాటరీతో కూడా స్లీక్ డిజైన్ కలిగి ఉందంటే, ఇది పెద్ద సైజులో ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ కాస్మిక్ బ్లాక్ మరియు గ్లేషియర్ బ్లూ రెండు రంగుల్లో లాంచ్ అవుతుంది.

ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను Qualcomm లేటెస్ట్ చిప్ సేట్ఠో లాంచ్ చేస్తున్నట్లు టీజర్ లో వివో తెలిపింది. అయితే, ఈ చిప్ సెట్ ని రేపు రివీల్ చేస్తుంది. అయితే, ఈ ఫోన్ Snapdragon 7s Gen 4 తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. అంతేకాదు, 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది.

Also Read: Ai Plus Nova 2 మరియు Nova 2 Ultra 5G ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!

ఈ ఫోన్ 50MP + 50MP డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉండే అవకాశం ఉందని కూడా కొన్ని రూమర్లు ఉన్నాయి. అయితే, ఇది వివో యొక్క బడ్జెట్ సిరీస్ నుంచి వచ్చే ఫోన్ కాబట్టి 50MP + 8MP డ్యూయల్ రియర్ కెమెరాతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మార్కెట్ వర్గాలు వేస్తున్నాయి. ఈ ఫోన్ మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా వివో ఒకొక్కటిగా రివీల్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :