Ai Plus Nova 2 మరియు Nova 2 Ultra 5G ప్రైస్ అండ్ ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.!
మాధవ్ సేథ్ ఆధ్వర్యంలోని మొబైల్ తయారీ కంపెనీ Ai+ నుంచి కొత్త ఫోన్లు ఈరోజు లాంచ్ చేసింది
నోవా సిరీస్ నుంచి Ai Plus Nova 2 మరియు Nova 2 Ultra 5G రెండు ఫోన్లను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది
ఈ రెండు ఫోన్లను కూడా రెండేసి వేరియంట్స్ లో చేసింది
మాధవ్ సేథ్ ఆధ్వర్యంలోని మొబైల్ తయారీ కంపెనీ Ai+ నుంచి కొత్త ఫోన్లు ఈరోజు లాంచ్ చేసింది. ఇందులో నోవా సిరీస్ నుంచి Ai Plus Nova 2 మరియు Nova 2 Ultra 5G రెండు ఫోన్లను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. అయితే, మూడవ ఫోన్ నోవా ఫ్లిప్ స్మార్ట్ ఫోన్ ను మాత్రం మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసింది. ఈరోజు సరికొత్తగా విడుదలైన నోవా 2 మరియు నోవా 2 అల్ట్రా రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.
SurveyAi Plus Nova 2 మరియు Nova 2 Ultra 5G ప్రైస్
ఈ రెండు ఫోన్లను కూడా రెండేసి వేరియంట్స్ లో చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడవచ్చు.
- నోవా 2 5జి (4 జీబీ + 64 జీబీ) ప్రైస్ : రూ. 8,999
- నోవా 2 5జి (6 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 10,999
ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 10,000 బడ్జెట్ ప్రైస్ సెగ్మెంట్ లో పోటీదారుగా మార్కెట్ లో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతుంది.
- నోవా 2 5జి అల్ట్రా (6 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 16,999
- నోవా 2 5జి అల్ట్రా (8 జీబీ + 128 జీబీ) ప్రైస్ : రూ. 18,999
ఈ ఫోన్ ను అండర్ రూ. 20,000 ప్రైస్ సెగ్మెంట్ లో కొత్త పోటీదారుగా ఇండియాలో లాంచ్ చేసింది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ ఫోన్ సేల్ అవుతుంది. ఈ ఫోన్ పై గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ కూడా కంపెనీ ఆఫర్ చేసింది.

Ai Plus Nova 2 : ఫీచర్స్
నోవా 2 ఫోన్ పెద్ద 6.74 ఇంచ్ HD+ స్క్రీన్ తో వస్తుంది మరియు ఇది మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి స్లీక్ అండ్ స్టైలిష్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ మొత్తం ఐదు సరికొత్త రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ను Unisoc T 8200 ఆక్టా కోర్ 5జి ప్రోసెసర్ తో అందించింది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ కంపెనీ యొక్క ప్రత్యేకమైన NextQ OS తో పని చేస్తుంది. ఇక IP రేటింగ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Also Read: Vivo V70 FE: భారీ డీల్స్ తో సేల్ కి అందుబాటులోకి వచ్చిన వివో 200MP కెమెరా ఫోన్.!
Ai Plus Nova 2 Ultra: ఫీచర్స్
నోవా 2 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ వెనుక సరికొత్త కలర్ ఫుల్ నోటిఫికేషన్ లైట్ తో లాంచ్ అయ్యింది. అంతేకాదు, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ తో వచ్చింది. నోవా 2 అల్ట్రా ఫోన్ లో పెద్ద 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 చిప్ సెట్ జతగా 8 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 50MP (Sony OIS) మెయిన్ కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ప్రత్యేకమైన బటన్ తో వస్తుంది. ఈ ఫోన్ 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు IP68 రేటింగ్ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile