Infinix Note 60 Pro 5G: ఎట్టకేలకు ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ లుక్ మరియు సూపర్ ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాగ్ షిప్ లెవెల్ అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్ మరియు యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది.
ఇన్ఫినిక్స్ నోట్ 60 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు ఇన్ఫినిక్స్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసింది. అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా విడుదల చేసింది.
ఈ అప్ కమింగ్ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ లలో మాత్రమే ఉండే 360 డిగ్రీ ఏరో స్పేస్ గ్రేడ్ అల్యూమినియం మెటల్ ఫ్రేమ్ కలిగి ఉంటుంది. ఇది ఫోన్ ను చూసే విధానం మరియు కాపాడే విధానంలో మరింత మెరుగైన అనుభూతిని అందిస్తుంది. అంటే, లుక్ అండ్ సెక్యూరిటీ పరంగా బాగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ ఫోన్ లో వెనుక అన్ని పనులకు సహకరించే యాక్టివ్ మ్యాట్రిక్స్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్ ని అన్ లాక్ చేయకుండా వెనక వైపు ఉండే ఈ డిస్ప్లే లో కాల్, నోటిఫికేషన్ మరియు బ్యాటరీ చార్జింగ్ తో పాటు టైం వంటి మరిన్ని వివరాలను చూడవచ్చు. ఈ సెటప్ ఈ ఫోన్ కు ఒక మంచి లుక్ మరియు యూజర్ కు ఒక మంచి అనుభూతిని అందిస్తుందని ఇన్ఫినిక్స్ చెబుతోంది.
ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో అందించిన కెమెరా సెటప్ వివరాలు కూడా వెల్లడయ్యాయి. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది అల్ట్రా క్లియర్ ఇమేజ్ లు అందిస్తుందని ఇన్ఫినిక్స్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో JBL ట్యూన్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కూడా ఉంటాయి.
Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి Thomson QLED Smart Tv లను అతి చవక ధరలో అందుకోండి.!
ఈ ఫోన్ డీప్ ఓషియన్ బ్లూ, మోచా బ్రౌన్ మరియు సోలార్ ఆరెంజ్ అనే మూడు అందమైన రంగుల్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ ను ఏప్రిల్ 10వ తేదీ ఇన్ఫినిక్స్ రివీల్ చేస్తుంది. కాబట్టి, అదే రోజు కొత్త అప్డేట్ తో మళ్ళి కలుద్దాం.