Vivo T5 Lite vs Realme Narzo 100x which one is which one better option for you
Vivo T5 Lite vs Realme Narzo 100x: వివో మరియు రియల్ మీ గత వారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన కొత్త స్మార్ట్ ఫోన్లు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా తమదైన స్టైల్, డిజైన్ మరియు ఫీచర్స్ తో వచ్చాయి. అయితే, వాటి ఫీచర్స్ ను బట్టి ఈ ఫోన్ ఎవరికి తగిన విధంగా ఉంటుందో చూద్దాం.
బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో వచ్చిన వివో టి5 లైట్ మరియు రియల్ మీ నార్జో 100x రెండూ కూడా మంచి ఎంపికలే అవుతాయి. అయితే, ఏ ఫోన్ ఎవరికి బెటర్? అనేది వాటి డిస్ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరా, బ్యాటరీ, సాఫ్ట్ వేర్ మరియు ధర వంటి అన్ని అంశాలు నిర్ణయిస్తాయి. అందుకే, రేపు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి రాబోతున్న ఈ రెండు ఫోన్లు పోల్చి చూద్దాం. ఇక్కడ అందించిన వివరాలు, స్పెసిఫికేషన్లు మరియు ప్రైస్ కూడా తాజా లాంచ్ సమాచారం పై ఆధారపడి అందించాము.
వివో టి5 లైట్ స్మార్ట్ ఫోన్ ప్రీమియం లుక్ తో వస్తుంది మరియు ఇది HD+ LCD రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మెరుగైన కాంట్రాస్ట్ తో వస్తుంది. రియల్ మీ నార్జో 100x స్మార్ట్ ఫోన్ కూడా LCD ప్యానెల్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది HD+ రిజల్యూషన్ మరియు 144 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ విభాగంలో రియల్ మీ నార్జో 100x విజేతగా నిలుస్తుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చక్కగా ఉంటుంది.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా MediaTek Dimensity 6300 చిప్ సెట్ తో లాంచ్ అయ్యాయి. ఈ రెదను కూడా దాదాపు ఒకే విధమైన పెర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ రెండు ఫోన్లు కూడా సోషల్ మీడియా, మల్టీటాస్కింగ్ మరియు రోజువారీ వినియోగానికి బాగుంటాయి. అంతేకాదు, హెవీ గేమింగ్ లో రెండూ దాదాపు ఒకే స్థాయి పెర్ఫార్మెన్స్ అందిస్తాయి. ఈ విభాగంలో ఈ రెండు ఫోన్లు కూడా విన్నర్స్ అని చెప్పవచ్చు.
వివో టి5 లైట్ ఫోన్ లో 50MP డ్యూయల్ రియర్ మరియు ముందు 5MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. అయితే, రియల్ మీ నార్జో 100x 50MP డ్యూయల్ రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ప్రధాన కెమెరా నాణ్యతలో రెండు ఫోన్లు సమానంగా ఉంటాయి. అయితే, సెల్ఫీల విషయంలో నార్జో 100x కొంచెం ముందుంటుంది.
ఈ విభాగంలో రియల్ మీ ఫోన్ క్లియర్ విజేత అవుతుంది. ఎందుకంటే, ఈ ఫోన్ 8000 mAh భారీ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అయితే, వివో స్మార్ట్ ఫోన్ కేవలం 6500 mAh బ్యాటరీ మరియు 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి రియల్ మంచి ఎంపిక అవుతుంది.
Also Read: boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ నార్మల్ సౌండ్ బార్ రేటుకే లభిస్తోంది .. డోంట్ మిస్.!
ఈ రెండు ఫోన్లు కూడా మిలటరీ గ్రేడ్ డ్యూరాబిలిటీ బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటాయి. అయితే, పెద్ద బ్యాటరీ కారణంగా రియల్ మీ ఫోన్ కొంచెం మందంగా ఉన్నట్లు కనిపిస్తుంది.
ఈ రెండు ఫోన్లలో ఏది ఎవరికి బెటర్ ఆప్షన్ అవుతుందని చూస్తే, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలంటే మరియు సెల్ఫీ కెమెరా ముఖ్యం అయితే రియల్ మీ నార్జో 100x మీకు తగిన ఫోన్ అవుతుంది. డిస్ప్లే మరియు HD+ రిజల్యూషన్ స్క్రీన్ తో రెండు ఫోన్లు కూడా వీడియోలు మరియు గేమింగ్ ఇష్టపడే వారికి బెటర్ ఆప్షన్ అవుతాయి.
ఇక ధర పరంగా చూస్తే, ఆల్ రౌండ్ ఫీచర్స్ తో కొంచెం తక్కువ బ్యాటరీ తో రూ. 19,999 ప్రైస్ ట్యాగ్ తో వచ్చే వివో టి 5 లైట్ ఫోన్ విజేతగా నిలుస్తుంది. కానీ బ్యాటరీని దృష్టిలో ఉంచుకుంటే మాత్రం రియల్ మీ నార్జో 100x విజేతగా నిలుస్తుంది.