Vivo T5 Lite : భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ తో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

HIGHLIGHTS

వివో టి సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది

వివో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ సిరీస్ గా T సిరీస్ ఫోన్ లకు ఇండియన్ మార్కెట్లో మంచి పేరుంది

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్ కూడా వెల్లడించింది

Vivo T5 Lite : భారీ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ తో కొత్త 5జి ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

Vivo T5 Lite: వివో టి సిరీస్ నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది. వివో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ సిరీస్ గా T సిరీస్ ఫోన్ లకు ఇండియన్ మార్కెట్లో మంచి పేరుంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఫోన్లు ఇండియాలో మంచి అమ్మకాలను సాధించాయి. మరి ఏ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను కూడా ఇండియన్ మార్కెట్ ను ఆకట్టుకునే ఫీచర్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo T5 Lite : లాంచ్ డేట్

వివో టి 5 లైట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఈ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు మాత్రమే వివో ప్రకటించింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ ఫోన్ వివరాలు కూడా ఈ టీజర్ పేజి నుంచి రివీల్ చేయడం ప్రారంభించింది.

Vivo T5 Lite : కీలక ఫీచర్స్

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టి 5 లైట్ స్మార్ట్ ఫోన్ డిజైన్ వెల్లడించే టీజర్ ఇమేజ్ ను వివో రిలీజ్ చేసింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్లీక్ అండ్ సింపుల్ డిజైన్ తో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉన్నట్లు అర్థం అవుతుంది.

Vivo T5 Lite

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్ కూడా వెల్లడించింది. అదేమిటంటే, ఈ అప్ కమింగ్ వివో ఫోన్ 6500 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ మాత్రమే వివో వెల్లడించింది. అయితే, ఈ అప్ కమింగ్ ఫోన్ లీక్డ్ ఫీచర్స్ మాత్రం ఈ ఫోన్ గురించి ఒక అవగాహన కల్పిస్తున్నాయి.

Also Read: Nothing Phone 4b: అప్ కమింగ్ ఫోన్ కీలక ఫీచర్ విడుదల చేసిన నథింగ్.!

లీక్డ్ ఫీచర్స్ ఏమిటి?

ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.77 ఇంచ్ LCD స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుందని లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 SoC చిప్ సెట్ మరియు 6GB ర్యామ్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా ఐదు లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ లో 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా వివో త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది కాబట్టి, ఈ లీక్డ్ ఫీచర్స్ లో ఎన్ని నిజం అవుతోందో త్వరలో తెలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile