Vivo X Fold 6 అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!

HIGHLIGHTS

Vivo X Fold 6 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది

. ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది

శక్తివంతమైన Dimensity 9500 సూపర్ ఎడిషన్ చిప్ శక్తితో అందించింది

Vivo X Fold 6 అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది .. ప్రైస్ ఎంతంటే.!

Vivo X Fold 6 స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈరోజు వివో నిర్వహించిన బిగ్ ఈవెంట్ నుంచి ఈ ఫోన్ తో పాటు Vivo V80 మరియు Vivo S2 FE స్మార్ట్ ఫోన్ లను కూడా లాంచ్ చేసింది. అయితే, వివో ఎక్స్ ఫోల్డ్ ఈ మొత్తం ఈవెంట్ లో ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. ఈ ఫోన్ అల్ట్రా ప్రీమియం డిజైన్ అండ్ ఫీచర్స్ తో రిలీజ్ అయ్యింది. ఈ లేటెస్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్ తో పాటు ప్రైస్ ఏమిటో ఓకే లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Vivo X Fold 6 : ప్రైస్

వివో ఈ ఫోన్ రూ. 2,19,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ను కంపెనీ ఈరోజు స్టార్ట్ చేసింది. అయితే, అక్టోబర్ 13వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది.

Vivo X Fold 6 : ఫీచర్స్

వివో ఈ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం రౌండ్ కార్నర్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 2.5D ఫ్లాట్ ఎడ్జ్ మెటల్ ఫ్రేమ్ మరియు మినిమల్ రింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 8.2 ఇంచ్ AMOLED మెయిన్ స్క్రీన్ మరియు 6.51 ఇంచ్ AMOLED కవర్ స్క్రీన్ ను ఆఫర్ చేసింది. ఈ ఎండు స్క్రీన్ లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటాయి. అంతేకాదు, ఈ ఫోన్ స్క్రీన్ ను HDR10+, Netflix HDR మరియు Dolby Vision వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Vivo X Fold 6 launched with ultra premium design and features

ఈ ఫోన్ మీడియాటెక్ లేటెస్ట్ గా విడుదల చేసిన శక్తివంతమైన Dimensity 9500 సూపర్ ఎడిషన్ చిప్ శక్తితో అందించింది. ఇది గరిష్టంగా 4.21GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది మరియు చాలా వేగంగా ఉంటుంది. దానికి జతగా 12GB LPDDR5X ర్యామ్ అండ్ 512GB ఇంటర్నల్ స్టొరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆరిజిన్ OS 7 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 17 OS తో లాంచ్ అయ్యింది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ మరియు లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక 200 MP ZEISS మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది మరియు కవర్ డిస్ప్లే పైన 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా కోసం ప్రత్యేకంగా V3+ చిప్ ని కూడా వివో ఈ ఫోన్ ను అందించింది. ఈ సెటప్ తో ఈ ఫోన్ 60FPS 4K Dolby Vision వీడియో రికార్డింగ్ చేసి అంధిస్తుంది. ఈ ఫోన్ లో లేటెస్ట్ వివో కెమెరా ఫీచర్స్ మరియు AI కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Also Read: vivo S2 FE మిడ్ రేంజ్ ధరలో స్టన్నింగ్ ఫీచర్ తో లాంచ్ అయ్యింది.!

ఈ ఫోన్ ను 6900 mAh బిగ్ బ్యాటరీతో వివో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 80W ఫాస్ట్ వైర్డ్ ఫాస్ట్ సపోర్ట్, 40W వైర్లెస్ ఫ్లాష్ ఛార్జ్ మరియు వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IPX8 మరియు IPX9 రేటింగ్ తో వాటర్ రెసిస్టెన్స్ మరియు IP5X డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ తో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile