Vivo T5 5G launched with premium features know price and offers
Vivo T5 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు వివో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ మరియు బిగ్ లాంచ్ ఆఫర్స్ తో లాంచ్ చేసింది. ఇందులో గొప్ప విజువల్స్ అందించే AMOLED స్క్రీన్, బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ కెమెరా వంటి ఫీచర్స్ అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్, ఆఫర్స్ మరియు ఈ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
వివో టి 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ 6GB + 128GB వేరియంట్ ను రూ. 34,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెకండ్ వేరియంట్ 8GB + 128GB ని రూ. 39,999 మరియు హై ఎండ్ 8GB + 256GB వేరియంట్ ని రూ. 44,999 రూపాయల ఆఫర్ ధరలో అందించింది. ఈ ఫోన్ ని రాయల్ బ్రోన్జ్ మరియు సిల్వర్ గ్రీన్ రెండు రంగుల్లో లాంచ్ చేసింది.
ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ ని వివో ప్రకటించింది. అదేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను Axis, HDFC మరియు SBI క్రెడిట్ కార్డుతో కొనే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 6 నెలల No cost EMI ఆఫర్ ని కూడా అందించింది. సెప్టెంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మొదటి సేల్ ప్రారంభం అవుతుంది.
Also Read: లేటెస్ట్ పవర్ ఫుల్ ఫోన్ Realme P4s 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి.!
వివో టి 5 స్మార్ట్ ఫోన్ ను 5 స్టార్ SGS సన్ లైట్ సపోర్ట్ కలిగిన 6.83 ఇంచ్ ప్రీమియం AMOLED స్క్రీన్ తో అందించింది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR 10+ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మంచి ఆకట్టుకునే న్యూ డిజైన్ మరియు డ్యూరబిలిటీ ఫీచర్స్ తో వస్తుంది.
ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ పరంగా, ఇది 1.2 మిలియన్ AnTuTu స్కోర్ అందించే మీడియాటెక్ Dimensity 7500 Turbo చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఇది 233% వేగవంతమైన ఆన్ డివైజ్ AI కంప్యూటింగ్ కలిగి ఉంటుంది. అలాగే, ఇందులో LPDDR5X 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 7050 mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయ్యింది మరియు ఇది 44w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా అందించింది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు ఉంటాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాలు రెండు కూడా 4K వీడియో సపోర్ట్ తో వస్తాయి. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ మరియు వివో కెమెరా ఫిల్టర్లు కూడా కలిగి ఉంటుంది.