లేటెస్ట్ పవర్ ఫుల్ ఫోన్ Realme P4s 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి.!
లేటెస్ట్ పవర్ ఫుల్ ఫోన్ Realme P4s 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి
రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా భారీ డీల్స్ అందించింది
ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ ప్రత్యేకమైన ఆఫర్లు మిస్ చేసుకోకండి
లేటెస్ట్ పవర్ ఫుల్ ఫోన్ Realme P4s 5G ఫస్ట్ సేల్ బిగ్ డీల్స్ మిస్ చేసుకోకండి. భారీ ఫీచర్స్ మరియు భారీ అంచనాలతో రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన రియల్ మీ పి4s స్మార్ట్ ఫోన్ లాంచ్ లో భాగంగా భారీ డీల్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ ఫోన్ ఫస్ట్ డే సేల్ ప్రత్యేకమైన ఆఫర్లు మిస్ చేసుకోకండి అని చెబుతున్నాను.
SurveyRealme P4s 5G : ప్రైస్ అండ్ ఆఫర్స్
ముందుగా ఈ లేటెస్ట్ రియల్ మీ ఫోన్ ధరల విషయానికి వస్తే, రియల్ మీ ఈ ఫోన్ ను మూడు వేరియంట్లలో అందించింది. ఈ మూడు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఈ ఫోన్ సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.
- రియల్ మీ పి4s (8GB + 128GB) ప్రైస్ : రూ. 34,999
- రియల్ మీ పి4s (8GB + 256GB) ప్రైస్ : రూ. 37,999
- రియల్ మీ పి4s (12GB + 256GB) ప్రైస్ : రూ. 41,999

అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ తో ఈ ఫోన్ తక్కువ ధరలో అందుకోవచ్చు. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ డిస్కౌంట్ SBI, ICICI మరియు HDFC క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ తీసుకునే వారికి లభిస్తుంది.
Also Read: Redmi Note 17 Pro Max: మరో బిగ్ బ్యాటరీ ఫోన్ లాంచ్ కోసం టీజర్ విడుదల చేసిన షియోమీ.!
Realme P4s: ఫీచర్స్
రియల్ మీ ఈ ఫోన్ ని మీడియాటెక్ Dimensity 7400 ప్రాసెసర్ మరియు జతగా హైపర్ విజన్ ప్లస్ AI చిప్ తో డ్యూయల్ చిప్ పవర్ ఫోన్ గా అందించింది. ఇది కాకుండా ఈ ఫోన్ ను మరింత వేగంగా నడిపించడానికి వీలుగా 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 14GB డైనమిక్ ర్యామ్ ఫీచర్ ని కూడా ఈ ఫోన్ లో అందించింది. అలాగే, 128GB మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ ను కూడా ఇందులో అందించింది.
ఇందులో 6.78 ఇంచ్ M14 AMOLED ప్రీమియం స్క్రీన్ అందించింది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 6500 నిట్స్ గొప్ప బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDR 10+, నెట్ ఫ్లిక్స్ HDR ఫీచర్ మరియు ప్రత్యేకమైన చిప్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో 8000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 80w ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంది.
ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరా మరియు 8MP AI అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన కెమెరాతో వస్తుంది. ఇది 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ తో పాటు లేటెస్ట్ ఏఐ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ తో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
