Vivo T4 Pro ఇండియా డేట్ అనౌన్స్ చేసిన వివో.!
Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను వివో ఈరోజు ప్రకటించింది
రీసెంట్ గా వివో టి4 5జి విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు వివో టి4 ప్రో ను కూడా లాంచ్ చేస్తోంది
ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజర్ ఇమేజ్ కూడా అందించింది
Vivo T4 Pro స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను వివో ఈరోజు ప్రకటించింది. వివో టి4 సిరీస్ నుంచి రీసెంట్ గా వివో టి4 5జి ఫోన్ విడుదల చేసిన కంపెనీ ఇప్పుడు వివో టి4 ప్రో ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుంచి ఇప్పటికే వివో టి4, వివో టి4x మరియు వివో టి4 లైట్ ఫోన్ లను అందించింది మరియు ఈ లైనప్ లో ఇప్పుడు ప్రో వేరియంట్ ను అందిస్తోంది.
SurveyVivo T4 Pro ఎప్పుడు లాంచ్ అవుతుంది?
వివో టి4 ప్రో స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో ఆగస్టు 26 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు వివో డేట్ అండ్ టైమ్ రివీల్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ ఫోన్ టీజింగ్ కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు టీజర్ ఇమేజ్ కూడా అందించింది.
Vivo T4 Pro ఫీచర్స్ ఏమిటి?
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి ఇంకా పూర్తి వివరాలు అందించ లేదు. కేవలం ఈ ఫోన్ లో అందించిన 3x పెరిస్కోప్ జూమ్ కెమెరా గురించి మాత్రమే వివరాలు బయటకు వెల్లడించింది. అయితే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఇతర వివరాలు కొన్ని తెలుస్తున్నాయి. ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు ఇమేజ్ ద్వారా తెలుస్తోంది.
Also Read: Hari Hara Veera Mallu OTT లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఎక్కడంటే.!
వివో టి4 ప్రో అంచనా ఫీచర్స్ ఏమిటి?
ఈ ఫోన్ అంచనా ఫీచర్స్ ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. వాటి ప్రకారం చూస్తే, ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్ కలిగిన క్వాడ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు అధిక బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కామ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఈ ఫోన్ లో 3x పెరిస్కోప్ సపోర్ట్ 50MP Sony IMX882 కెమెరా జతగా 50MP మెయిన్ సెన్సార్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఈ ఫోన్ భారీ 6500 mAh బిగ్ బ్యాటరీ మరియు 90W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుందని కూడా మరికొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఫోన్ లాంచ్ ప్రకటించింది కాబట్టి ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా వివో త్వరలోనే అఫీషియల్ గా వెల్లడించే అవకాశం ఉంటుంది.