Hari Hara Veera Mallu OTT లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఎక్కడంటే.!

HIGHLIGHTS

Hari Hara Veera Mallu OTT లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్‌-అడ్వెంచర్ చిత్రం ’ హరి హర వీరమల్లు’

‘సనాతన ధర్మ పరిరక్షణ’ ఈ సినిమా ప్రధాన సారాంశం గా ఉంటుంది

Hari Hara Veera Mallu OTT లో స్ట్రీమింగ్ అవుతోంది.. ఎక్కడంటే.!

Hari Hara Veera Mallu OTT లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సరికొత్త కథాంశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్‌-అడ్వెంచర్ చిత్రం ’ హరి హర వీరమల్లు’. ఈ సినిమా ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, తమిళం మరియు మలయాళం మూడు భాషల్లో అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా భారీ అంచనాలతో థియేటర్ లో పెట్టింది. అయితే, నెగిటివ్ టాక్ తో అంతగా ఆదరణ పొందలేక పోయినట్లు నివేదికలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ సాధించి ఎమ్మెల్యే అయిన తర్వాత తీసిన తొలి చిత్రం ఇది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Hari Hara Veera Mallu OTT రిలీజ్ ఎప్పుడు?

హరి హర వీరమల్లు ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా తెలుగు, మళయాలం మరియు తమిళం మూడు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

Hari Hara Veera Mallu తారాగణం మరియు కథాంశం ఏమిటి?

హరి హర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (వీరమల్లు) హీరోగా నటించారు. ఇందులో కథానాయికగా నిధి అగర్వాల్ (పంచమి), ఔరంగజేబ్ పాత్రలో బాబీ డియోల్ నటించగా, నోరా ఫతేహి, తనికెళ్ల భరణి, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి సినీ ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు.

Hari Hara Veera Mallu OTT

ఇక కథ విషయానికి వస్తే, ఈ సినిమ ఒక పీరియాడికల్ యాక్షన్‌-అడ్వెంచర్ సినిమా. ‘సనాతన ధర్మ పరిరక్షణ’ ఈ సినిమా ప్రధాన సారాంశం గా ఉంటుంది. అయితే, ఇది కల్పిత కథ మరియు ఇది రెండు భాగాలుగా విభజించబడింది. హరి హర వీరమల్లు పార్ట్ 1 స్వార్డ్ vs స్పిరిట్ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది.

భారీ అంచనాలతో థియేటర్ లో అడుగుపెట్టిన హరి హర వీరమల్లు సినిమా కి అడుగడుగునా నెగిటివ్ టాక్ రావడంతో, ఈ సినిమా నిర్మాతకు నష్టాలు వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఈ స్ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. ఈ సినిమా సెట్స్ నుంచి థియేటర్ లోకి రావడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలు నిర్వహిస్తూనే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పూర్తి చేయడానికి శ్రమించారు.

Also Read: Realme P4 Pro 5G: సెగ్మెంట్ పవర్ ఫుల్ ఫోన్ గా లాంచ్ అయ్యింది.!

థియేటర్ లో బోల్తా కొట్టిన సినిమాలు సైతం ఓటిటీ గొప్ప ప్రజాదరణను అందుకుంటాయి. మరి ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయిన హరి హర వీరమల్లు సినిమా ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo