Vivo T3 Pro ఫోన్ 50MP Sony IMX 882 కెమెరా మరియు కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది.!

HIGHLIGHTS

Vivo T3 Pro స్మార్ట్ ఫోన్ ఆగస్టు 27న లాంచ్ అవుతుంది

ఈ ఫోన్ ను 50MP Sony IMX 882 కెమెరా మరియు కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది

ఈ ఫోన్ లో 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే Curved AMOLED స్క్రీన్ వుంది

Vivo T3 Pro స్మార్ట్ ఫోన్ ను ఆగస్టు 27 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నట్లు వివో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు కీలకమైన ఫీచర్స్ ను కూడా ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. ఈ ఫోన్ ను 50MP Sony IMX 882 కెమెరా మరియు కర్వుడ్ స్క్రీన్ తో వస్తోంది.

Vivo T3 Pro : కీలకమైన ఫీచర్స్

వివో టి 3 ప్రో స్మార్ట్ ఫోన్ ను గొప్ప కర్వుడ్ డిజైన్ కర్వుడ్ స్క్రీన్ తో తీసుకొస్తున్నట్లు వివో తెలిపింది. ఈ ఫోన్ లో 120 రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించే Curved AMOLED స్క్రీన్ వుంది. ఈ ఫోన్ కేవలం 7.49mm మందంతో చాలా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు ఇది 820K+ AnTuTu స్కోర్ అందిస్తుందని కూడా వివో తెలిపింది.

ఈ ఫోన్ కలిగి ఉన్న కెమెరా సెటప్ ను కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP Sony IMX 882 ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరొక సెన్సార్ ఉంటాయి. ఈ స్మార్ట్ ఫోన్ సాండ్ స్టోన్ ఆరెంజ్ అనే కలర్ తో అందంగా కనిపిస్తుంది మరియు ఇది లెదర్ బ్యాక్ ప్యానల్ తో ఉంటుంది.

Also Read: Poco Pad 5G: డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన పెద్ద స్క్రీన్ తో లాంచ్ అయ్యింది.!

ఈ ఫోన్ యొక్క బ్యాటరీ మరియు ఛార్జ్ సపోర్ట్ వివరాలను ఆగస్టు 26వ తేదీ వివో వెల్లడిస్తుంది. ఈ ఫోన్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ అందమైన లుక్ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో పాటు సరికొత్త కలర్ లో ఇండియన్ మార్కెట్లో అడుగు పెట్టబోతున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ ఫోన్ ధరను బట్టి ఈ ఫోన్ ఏ బడ్జెట్ సెగ్మెంట్ ను టార్గెట్ చేస్తుందో అర్థం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :