Vivo నుండి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్.. లాంచ్ డేట్ కూడా ఫిక్స్.!!

HIGHLIGHTS

వివో త్వరలో విడుదల చేయనున్న మరొక స్మార్ట్ ఫోన్ వివరాలను అందించింది

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T1X

జూలై 20 న ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న Vivo T1X

Vivo నుండి వస్తున్న మరో స్మార్ట్ ఫోన్.. లాంచ్ డేట్ కూడా ఫిక్స్.!!

వివో త్వరలో విడుదల చేయనున్న మరొక స్మార్ట్ ఫోన్ వివరాలను అందించింది. అదే, Vivo T1X మరియు ఈ స్మార్ట్ ఫోన్ ను జూలై 20 న ఇండియాలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ T1X కోసం Flipkart ఇప్పటికే ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. అంటే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ యొక్క ఆన్లైన్ పార్ట్నర్ కావచ్చు. అంతేకాదు, ఈ అప్ కమింగ్ వివో స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని వివరాలను కూడా కంపెనీ ప్రకటించింది. జూలై 20 న ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టబోతున్న Vivo T1X గురించి ప్రస్తుతం కంపెనీ అందించిన వివరాలు మరియు మరిన్ని వివరాలు ఏమిటో ఒక లుక్ వేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వైబ్సైట్ పేజ్ ప్రకారం, వివో టి1x స్మార్ట్ ఫోన్ 2.4 GHz క్లాక్ స్పీడ్ కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది మరియు దీనికి జతగా ఒక ఫ్లాష్ లైట్ కూడా వుంది. అలాగే, ఈ ఫోన్ చాలా సన్నని డిజైన్ లో కనిపిస్తోంది మరియు ఎటువంటి హడావిడీ లేకుండా చాలా క్లీన్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ రెండు కలర్ అప్షన్ లలో రానున్నట్లు కూడా టీజర్ పేజ్ ద్వారా అర్ధమవుతోంది.

ఈ ఫోన్ లాంచ్ కావడానికి ఇంకా సమయం వున్నది కాబట్టి, వివో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని వివరాలను లాంచ్ కంటే ముందుగానే ప్రకటించే అవకాశం వుంది. అయితే, Vivo T1X ముందుగానే చైనాలో విడుదల చెయ్యబడింది కాబట్టి ఈ ఫోన్ స్పెక్స్ ను ముందుగానే అంచనా వేస్తున్నారు.

Vivo T1X యొక్క అంచనా స్పెక్స్ గురించి చూస్తే, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ కలిగిన 6.58-ఇంచ్ FHD+ డిస్ప్లేని కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ కూడా అదే మీడియాటెక్ డైమెన్సిటీ 900SoC తో రావచ్చని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, 8GB RAM మరియు 256GB స్టోరేజ్ తో కూడా జత చేయబడుతుందని ఊహిస్తున్నారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo