రేపు విడుదలకానున్న VIVO S5 మరిన్ని రెండర్స్ కనిపించాయి

రేపు విడుదలకానున్న VIVO S5 మరిన్ని రెండర్స్ కనిపించాయి
HIGHLIGHTS

స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని రెండర్లు ఇప్పటికే వీబోలో ప్రచురించబడ్డాయి.

వివో ఎస్ 5 నవంబర్ 14 న లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది, కాని ఇంకా రెండర్లు వస్తూనే ఉన్నాయి. ప్రోమో పోస్టర్‌ లో స్మార్ట్‌ ఫోన్ ఎలా ఉంటుందో వివో ఇప్పటికే వెల్లడించింది. అయితే, స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని రెండర్లు ఇప్పటికే వీబోలో ప్రచురించబడ్డాయి. ఈ ఫోన్ డైమండ్ ఆకారంలో ఉన్న మాడ్యూల్‌ లో ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్ మరియు ఎగువ-కుడి అంచున ఉంచిన కటౌట్‌ తో పంచ్ – హోల్ డిస్ప్లేతో  కనిపిస్తుంది.

అయితే, ఇప్పుడు వచ్చిన ఈ కొత్త రెండర్లు వివో సంస్థ నుండి నేరుగా వచ్చాయి. వివో ఎస్ 5 రెండర్లను విడుదల చేయడానికి వివో వీబో ను మాధ్యమంగా  తీసుకుంది . ఈ ఫోన్ బ్లూ మరియు వైట్ వంటి రెండు గ్రేడియంట్ ఫినిష్ రంగులతో కనిపిస్తుంది. కెమెరా మాడ్యూల్ మరియు పంచ్-హోల్ డిస్ప్లే కాకుండా, 3.5 MM ఆడియో జాక్ ఎగువ అంచున కనిపిస్తుంది, USB టైప్-సి పోర్ట్ మరియు స్పీకర్ గ్రిల్ వివో ఎస్ 5 దిగువ అంచున ఉన్నాయి.

వివో S 5 ప్రత్యేకతలు (రూమర్డ్)

TENAA ప్రకారం, వివో ఎస్ 5 ఒక 6.44-అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది, ఇది FHD రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్ మరియు 20: 9 యాస్పెక్ట్ రేషియాతో ఉంటుంది. ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందించగల ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తిగల, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 చిప్‌సెట్ కావచ్చు.

వివో ఎస్ 5 లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ / 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఇది Android 9 పై ని అమలవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ 22.5W రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు గల ఒక 4010 ఎంఏహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే, వివో ఎస్ 5 క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నట్లు చూపబడింది. నాలుగు కెమెరాలు : 48MP + 8MP + 5MP + 2MP కావచ్చు. ఇందులో 32 MP సెల్ఫీ షూటర్ ఉండవచ్చు. మునుపటి లీక్‌ల ప్రకారం, వివో ఎస్ 5 ను గ్రేడియంట్ ఫినిష్‌తో బ్లూ, గ్రీన్ మరియు పింక్ రంగులలో అందుబాటులో ఉంచవచ్చు. ఇది 2000 యువాన్ల కన్నా తక్కువకు ప్రారంభించబడవచ్చు, ఇది సుమారు రూ .20,000 గా మారుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo