Vivo S2: కళ్ళు చెదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

Vivo S2 స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు ఈరోజు ఇండియాలో విడుదల చేసింది

ళ్ళు చెదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో రిలీజ్ చేయడం విశేషం

వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది

Vivo S2: వివో S series సింగిల్ డిజిట్ స్మార్ట్ ఫోన్ ని గత ఆరు సంవత్సరాలుగా రిలీజ్ చేయడం ఆపేసింది. అయితే, 2020 తర్వాత ఎట్టకేలకు ఈ సిరీస్ నుంచి వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కళ్ళు చెదిరే డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో రిలీజ్ చేయడం విశేషం. ఈ ఫోన్ లేటెస్ట్ డిజైన్, కెమెరా సెటప్ మరియు మంచి పెర్ఫార్మన్స్ అందించే ఫీచర్స్ తో వచ్చింది.

Vivo S2: ప్రైస్

వివో ఈ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 39,999 ప్రైస్ తో మరియు హైఎండ్ (8GB + 256GB) వేరియంట్ ను రూ. 44,999 ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ ను కూడా ఈ రోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ సిల్క్ వైట్, సఫైర్ బ్లూ మరియు రీగల్ బ్రోన్జ్ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది. ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది.

ఆఫర్స్

వివో ఈ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్లు అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 4,000 రూపాయల భారీ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 4,500 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ రెండు ఆఫర్స్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒక ఆఫర్ మాత్రమే లభిస్తుంది. ఈ ఫోన్ ను HDFC, SBI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో తీసుకునే వారికి ఈ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇవి కాకుండా, రూ. 1,000 రూపాయల అదనపు స్టూడెంట్ డిస్కౌంట్ మరియు 1 ఇయర్ అదనపు వారంటీ ఆఫర్లు కూడా అందించింది.

Also Read : Samsung Galaxy S25 Ultra అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ బిగ్ డీల్ గా వచ్చింది .. రేటు ఎంత తగ్గిందంటే.!

Vivo S2: ఫీచర్స్

వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ 6.83 ఇంచ్ 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ముందు మరియు వెనుక కూడా కర్వుడ్ డిజైన్ తో కళ్లుచెదిరే డిజైన్ తో వచ్చింది. ఈ ఫోన్ స్క్రీన్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో ఉన్న స్క్రీన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. వివో ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7360 Turbo చిప్ సెట్, 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వంటి ప్రత్యేకతలతో లాంచ్ చేసింది.

ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX 852 మెయిన్ కెమెరా మరియు 2MP సెకండరీ సెన్సార్ ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్, వివో యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫిల్టర్లు కలిగి ఉంటుంది. ఇక వీడియో సపోర్ట్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ముందు మరియు వెనుక రెండు కెమెరాలు కూడా 4K వీడియో సపోర్ట్ కలిగి ఉంటాయి.

బ్యాటరీ పరంగా, ఈ ఫోన్ లో 7,050 mAh పవర్ ఫుల్ అండ్ బిగ్ బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 44W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ మరియు బైపాస్ ఛార్జ్ వంటి ఫీచర్లు కూడా అందించింది. ఈ ఫోన్ IP68 మరియు IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :