వివో S1 మీడియా టెక్ హీలియో P65 ప్రాసెసరుతో విడుదలైన మొదటి స్మార్ట్ ఫోన్

వివో S1 మీడియా టెక్ హీలియో P65 ప్రాసెసరుతో విడుదలైన మొదటి స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

వివో ఎస్ 1 ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది.

ఈ ఫోన్‌లో ఒక 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది.

ప్రస్తుతం, వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయింది, ఒక వారం కన్నా ఎక్కువ దీని టీజింగులు మరియు లీక్స్ వంటి వాటితో ఇంటర్నెట్‌ లో  హోరెత్తించింది. ఈ లాంచ్,  చైనాలో ప్రారంభించిన దాదాపు 4 నెలల తర్వాత జరిగింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఈ చైనీస్ మరియు గ్లోబల్ వేరియంట్స్‌లో, కొన్ని  స్పెక్స్ యొక్క లక్షణాల వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఈ రెండు మోడళ్ల స్పెక్స్, ఫీచర్స్ మరియు ధరల మధ్య తేడా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

VIVO S1 : ధర

వివో ఎస్ 1 యొక్క గ్లోబల్ వేరియంట్ ఇండోనేషియాలో ప్రారంభించబడింది. ఇక్కడ ఇది 35,99,000 రూపాయలతో విడుదలయ్యింది, అంటే భారతదేశంలో దీని ధర సుమారు 17,700 రూపాయలుగా ఉంటుంది.  మీరు ఈ స్మార్ట్ ఫోన్ను మీరు రెండు  రంగులలో పొందవచ్చు. ఈ వివో ఎస్ 1 స్మార్ట్‌ ఫోన్ను కాస్మిక్ గ్రీన్ మరియు స్కైలైన్ బ్లూ రంగులలో ఎంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అమ్మకాలు జూలై 23 నుండి మొదలవుతాయి. ఈ మొబైల్ ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

వివో ఎస్ 1 ఫీచర్లు మరియు ప్రత్యేకతలు

ఈ వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ ఫోన్‌ లో, మీడియా టెక్ ఇటీవలే ప్రవేశపెట్టిన మీడియాటెక్ హెలియో పి 65 ప్రాసెసర్ ని అందించింది, ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే అని చెప్పవచ్చు. అదనంగా, ఇది 4GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

వివో ఎస్ 1  ఫోన్‌లో ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది కాకుండా మీరు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. ఒక 16MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది.

ముఖ్యంగా, ఈ ఫోనులో  మీరు ఒక ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్‌ను పొందుతున్నారు, దీనికి అదనంగా మీరు డ్యూయల్ సిమ్ మద్దతుతో పనిచేస్తుంది. ఈ ఫోన్  Android 9 తో పనిచేస్తుంది. ఈ ఫోన్ కనెక్టివిటీ ఎంపికలుగా వై-ఫై, బ్లూటూత్ 5, USB OTG , మైక్రో యుఎస్‌బి మరియు జిపిఎస్‌ల తో  వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo