VIVO S1 Pro భారీ స్పెక్స్ తో మిడ్ రేంజ్ ధరలో గట్టి పోటీగా వచ్చింది

HIGHLIGHTS

కేవలం ఒకే ఒక్క వేరియంట్లో లాంచ్ చేయబడింది.

VIVO S1 Pro భారీ స్పెక్స్ తో మిడ్ రేంజ్ ధరలో గట్టి పోటీగా వచ్చింది

వివో సంస్థ తన వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ ఫోన్ను భారతీయ మార్కెట్లో రూ .19,990 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ ఫోనులో మీకు 48 MP  క్వాడ్-కెమెరా సెటప్ మరియు 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ లభిస్తుంది. ఇక ఈ వివో ఎస్ 1 ప్రో యొక్క స్పెక్స్ చూస్తే, ఈ స్మార్ట్‌ ఫోన్ రియల్మీ ఎక్స్ 2 లేదా రెడ్మి కె 20 తో పోటీ పడగలదని చెప్పవచ్చు. ఈ వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ ఫోనులో, మీకు 48 ఎంపి క్వాడ్-కెమెరా సెటప్, మంచి డిజైన్ మరియు  క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 665 చిప్‌ సెట్‌ అందుకుంటారు. ఆఫ్‌ లైన్ మార్కెట్‌, వివో వెబ్సైట్, అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వివో ఎస్ 1 ప్రో : ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్‌ ని బట్టి, ఇది రియల్మీ ఎక్స్‌ 2 మరియు రెడ్మి కె 20 లకు గట్టి పోటీని ఇస్తుందని చెప్పబడింది. ఇక దీని స్పెక్స్ గురించి మాట్లాడితే, ఈ మొబైల్ ఫోన్‌ ఒక 6.38-అంగుళాల FHD + డిస్ప్లేతో లభిస్తుంది. అయితే, ఇది మీకు సూపర్ అమోలేడ్ ప్యానెల్, ఒక ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో లభిస్తుంది. అయితే, ఇందులో, మీరు ఎటువంటి పంచ్-హోల్ డిస్ప్లే పొందలేరు.

ఈ మొబైల్ ఫోను ఒక క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 665 SoC శక్తితో నడుస్తుంది. ఇది కాకుండా మీకు 8GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజితో ఈ ఫోన్ అందించబడుతుంది. అంతేకాదు,  మీరు ఈ మొబైల్ ఫోన్ స్టోరేజిని కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే ఇందులో ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. అయితే,  కేవలం ఒకే ఒక్క వేరియంట్లో లాంచ్ చేయబడింది.

ఇక కెమెరా విభాగానికి వస్తే, ఈ వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ ఫోనులో 48 MP ప్రైమరీ లెన్స్ అందుతుంది. ఇది కాకుండా, మరో మూడు కెమెరాలు కూడా ఈ మొబైల్ ఫోన్‌ లో ఉన్నాయి. వీటిలో, ఒక 8 MP అల్ట్రా వైడ్ లెన్స్‌ ,  2MP మాక్రో సెన్సార్‌తో పాటు 2MP డెప్త్ సెన్సార్‌ ను కూడా కలిగి ఉంటుంది. మొత్తం మీద, మీరు ఈ స్మార్ట్‌ ఫోనులో వెనుక నాలుగు కెమెరాలను పొందుతున్నారు. ఇక ముందు భాగంలో,  ఈ మొబైల్ ఫోనులో ఒక 32MP సెల్ఫీ సెన్సార్‌ ను అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై OS మరియు ఫన్ టచ్ స్కిన్ పైన నడుస్తుంది.

వివో ఎస్ 1 ప్రో ధర మరియు లభ్యత, లాంచ్ ఆఫర్

ఈ వివో ఎస్ 1 ప్రో స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఒకే వేరియంట్‌ లో లాంచ్ అయింది. ఈ మొబైల్ ఫోన్ను 8GB ర్యామ్, 128 GB  స్టోరేజ్‌ తో లాంచ్ చేశారు. మీరు ఈ మోడల్‌ ను కేవలం రూ .19,990 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ధర వద్ద మరియు అటువంటి స్పెక్స్‌తో, ఈ మొబైల్ ఫోన్ రియల్మి ఎక్స్ 2 మరియు రెడ్మి కె 20 లకు గట్టి పోటీని ఇస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా, మీరు ఈ మొబైల్ ఫోన్ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ మార్కెట్ల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్ అనగా వివో ఎస్ 1 ప్రో ను ఆఫ్‌ లైన్ మార్కెట్‌తో పాటు అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ మరియు వివో ఆన్‌లైన్ షాపుల నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ మొబైల్ ఫోన్ సేల్ జనవరి 4 నుంచి మొదలయ్యింది. మీరు ఈ మొబైల్ ఫోన్ను మిస్టిక్ బ్లాక్ లేదా జాజీ బ్లూ కలర్స్‌తో పాటు డ్రీమీ వైట్ కలర్‌లో తీసుకోవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile