లీకైన వివో S1 ఇండియా వేరియంట్ ధర

HIGHLIGHTS

ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

లీకైన వివో S1 ఇండియా వేరియంట్ ధర

వివో ఇండియాలో కొత్తగా తీసుకురానున్న స్మార్ట్ ఫోన్ అయినటువంటి వివో S1 యొక్క ఇండియన్ వేరియంట్ ధర ఇప్పుడు ఆన్లైన్లో లీకయ్యింది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో IDR 35,99,000 ధరతో విడుదలయ్యింది. ఆగష్టు 7 న ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చెయ్యడానికి డేట్ సెట్ చేయగా, ఇప్పుడు ఈ వేరియంట్ యొక్క ధర లీకవ్వడం గమనార్హం. దీన్ని ముందుగా ఇండియాషాప్స్.కామ్ నివేదించింది.         

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇండియాషాప్స్.కామ్ ప్రకారం, వివో ఎస్ 1 యొక్క ఇండియా ధర రూ .17,990 నుండి ప్రారంభమవుతుంది. బేస్ వేరియంట్లో 4 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న మిగతా రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ .19,990, రూ .24,990. ఈ ఫోన్‌ను ఈ నెల మొదట్లో ఇండోనేషియాలో ఐడిఆర్ 35,99,000 (సుమారు రూ .17,650) కోసం లాంచ్ చేశారు, కాబట్టి లీకైన ఇండియా ధర అంతర్జాతీయ ధరతో సమానంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వివో ఎస్ 1 ఫీచర్లు మరియు ప్రత్యేకతలు ( ఇండినేషియా వేరియంట్ )

ఈ వివో ఎస్ 1 మొబైల్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ మొబైల్ ఫోన్‌ లో, మీడియా టెక్ ఇటీవలే ప్రవేశపెట్టిన మీడియాటెక్ హెలియో పి 65 ప్రాసెసర్ ని అందించింది, ఈ ప్రాసెసర్‌తో లాంచ్ చేసిన మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఇదే అని చెప్పవచ్చు. అదనంగా, ఇది 4GB RAM తో అనుసంధానం చెయ్యబడింది మరియు ఇది 128GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది.

వివో ఎస్ 1  ఫోన్‌లో ఒక 6.38-అంగుళాల FHD + స్క్రీన్‌ తో వస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే మరియు ఇది ఒక వాటర్‌డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది కాకుండా మీరు ఫోటోగ్రఫీ కోసం వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ పొందుతారు. ఒక 16MP ప్రాధమిక సెన్సార్‌కి జతగా మరొక 8MP వైడ్ యాంగిల్ కెమెరాను మరియు ఒక  2MP డెప్త్ సెన్సార్ కూడా లభిస్తుంది. ఇది కాకుండా, మీకు ఈ ఫోన్‌లో 32 MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీల కోసం అందించబడింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo