Vivo T4x 5G: వివో అప్ కమింగ్ బడ్జెట్ ఫోన్ టీజింగ్ మొదలుపెట్టింది.!
Vivo T3x 5G నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు అనౌన్స్ చేసింది
Vivo T4x 5G ఫోన్ ను సెగ్మెంట్ లో ఆకట్టుకునే ప్రత్యేకతలతో తీసుకు రాబోతున్నట్లు ఊరిస్తోంది
వివో టి4x 5జి ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు వివో అనౌన్స్ చేసింది
Vivo T4x 5G: గత సంవత్సరం ఏప్రిల్ నెలలో వివో అందించిన బడ్జెట్ 5జి ఫోన్ Vivo T4x 5G నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ను సెగ్మెంట్ లో ఆకట్టుకునే ప్రత్యేకతలతో తీసుకు రాబోతున్నట్లు ఊరిస్తోంది. అంతేకాదు, ఈరోజు వివో ప్రీమియం కెమెరా సిరీస్ అయిన V సిరీస్ నుంచి V50 స్మార్ట్ ఫోన్ ను కూడా లాంచ్ చేస్తోంది.
Vivo T4x 5G: లాంచ్
వివో టి4x 5జి స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు వివో అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను ప్రస్తుతం ‘Coming Soon’ బ్యానర్ తో టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలను మాత్రం లాంచ్ కంటే ముందుగానే వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజీ అందించింది.
Vivo T4x 5G: ఫీచర్స్
వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను 2024 ఏప్రిల్ లో T సిరీస్ నుంచి అందించిన T3x తరువాతి తరం ఫోనుగా ఈ T4x ను అందిస్తుంది. T3x స్మార్ట్ ఫోన్ ను 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన కెమెరా, సరికొత్త డిజైన్ మరియు పవర్ ఫుల్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో ఆకట్టుకునే ధరలో అందించింది. అయితే, అప్ కమింగ్ ఫోన్ ను మరిన్ని అప్గ్రేడ్ లతో అందించే అవకాశం ఉంటుంది.
వివో టి4x 5జి కోసం ఫ్లిప్ కార్ట్ అందించిన టీజర్ పేజ్ మరియు కంపెనీ అధికారిక X అకౌంట్ నుంచి అందించిన టీజర్ ద్వారా ఈ ఫోన్ ను సెగ్మెంట్ యొక్క పెద్ద బ్యాటరీ ఫోన్ గా నిలబెట్టబోతోంది. అంటే, ఈ ఫోన్ ను లాంచ్ చేసే బడ్జెట్ లో ఈ ఫోన్ అతి పెద్ద బ్యాటరీ కలిగిన ఫోన్ గా నిలుస్తుంది. మరో మైల్ స్టోన్ లోడ్ అవుతోందని కూడా వివో ఈ ఫోన్ గురించి టీజింగ్ ద్వారా తెలియజేసింది.
Also Read: బిగ్ డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న బ్రాండెడ్ 43 ఇంచ్ 4K Smart Tv
అంతేకాదు, హృదయాలను గెలుచుకున్న మరియు రికార్డ్స్ బ్రేక్ చేసిన వివో Series T నుంచి మరో గొప్ప ఫోన్ వస్తోంది, అని ఈ టీజర్ ద్వారా టీజ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ ను ఎటువంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తోందో చూడాలి.