Vivo S2 FE: ఇటీవల విడుదల చేసిన వివో ఎస్ 1 ఫోన్ బడ్జెట్ వెర్షన్ లాంచ్ చేస్తున్న వివో.!

HIGHLIGHTS

రీసెంట్ గా గత నెల వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ఇండియా మార్కెట్లో వివో తిరిగి పరిచయం చేసింది

వివో s2 డౌన్ టోన్ వెర్షన్ Vivo S2 FE స్మార్ట్ ఫోన్ లాంచ్ ఈరోజు అనౌన్స్ చేసింది

ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ చాలా కొత్తగా అనిపిస్తుంది

Vivo S2 FE: వివో S1 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన చాలా సంవత్సరాల తర్వాత రీసెంట్ గా గత నెల వివో ఎస్ 2 స్మార్ట్ ఫోన్ ని మరలా తిరిగి ఇండియా మార్కెట్లో వివో తిరిగి పరిచయం చేసింది. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ని మరింత వేగంగా లాంచ్ చేయాలని చూస్తున్నట్లు ఉంది. అందుకే కాబోలు వివో s2 స్మార్ట్ ఫోన్ విడుదల చేసిన నెలకే ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డౌన్ టోన్ వెర్షన్ వివో ఎస్ 2 ఎఫ్ ఈ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నట్లు ఈరోజు అనౌన్స్ చేసింది.

Vivo S2 FE: లాంచ్ డేట్

వివో ఎస్ 2 FE స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ ను వివో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. కానీ అప్ కమింగ్ ఈ స్మార్ట్ ఫోన్ ని త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు అమెజాన్ ఇండియా ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ మాత్రం స్టార్ట్ చేసింది.

Vivo S2 FE: ఫీచర్స్

ఇటీవల విడుదలైన వివో ఎస్ 2 ఫోన్ డిజైన్ తో పోలిస్తే, ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ టూ స్మార్ట్ ఫోన్ లో పైన అడ్డంగా ఉంచిన డ్యూయల్ కెమెరా సిస్టం ఉంటుంది. అయితే, ఎస్ 2 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ లో పెద్ద కెమెరా ఐలాండ్ లో నిలువుగా ఉంచిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్లో 50MP ప్రధాన కెమెరా కలిగిన ట్రిపుల్ కెమెరా సిస్టం ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కనిపిస్తోంది. అయితే, ఇందులో ట్రిపుల్ లేదా డ్యూయల్ రియర్ కెమెరా ఉందనేది ఇంకా క్లియర్ కాలేదు.

ఈ ఫోన్ కూడా వివో ఎస్ 2 మాదిరిగా స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ సరికొత్త గ్రీన్ కలర్ వేరియంట్ లో ఉన్నట్లు టీజర్ ఇమేజ్ లో కనిపిస్తోంది. మొత్తానికి మార్కెట్ లో ఎస్ సిరీస్ ప్రాముఖ్యత మరింత పెంచడానికి వివో ఈ సీరీస్ ఫోన్ లను చాలా ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలక ఫీచర్స్ కొన్ని నెట్టింట్లో లీకయ్యాయి.

Also Read: Oppo F35 Series లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్స్ అనౌన్స్ చేసిన ఒప్పో .. డిజైన్ కొత్తగా ఉంది.!

లీక్డ్ అండ్ రూమార్డ్ ఫీచర్స్

వివో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ని మీడియా టెక్ యొక్క లేటెస్ట్ బడ్జెట్ పవర్ ఫుల్ ప్రాసెసర్ Dimensity 7300e తో లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా అంచనా వేస్తున్నారు. అలాగే, ఇందులో గొప్ప ఇమేజ్ లు మరియు వీడియోలు అందించే 50MP Sony IMX 852 మెయిన్ కెమెరా ఉండే అవకాశం ఉండొచ్చు. ఈ ఫోన్ లో పెద్ద 1.5K AMOLED స్క్రీన్ ఉంటుందని కొన్ని చెబుతున్నాయి. మొత్తానికి ఈ ఫోన్ ను కూడా ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :