ఇండియాలో బడ్జెట్ ధరలో U సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్న VIVO

ఇండియాలో బడ్జెట్ ధరలో U సిరీస్ ఫోన్లను విడుదల చేయనున్న VIVO
HIGHLIGHTS

అమెజాన్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ ని కూడా దీనికోసం కేటాయించింది

వివో సంస్థ కొత్తగా తన  U-సిరీస్ ని కూడా ఇండియాలో కంపెనీ ప్రారంభించబోతోంది.ఈ మొబైల్ ఫోన్ తక్కువ ధరకు లాంచ్ కానుంది. అమెజాన్ ఇండియా ద్వారా ఈ సిరీస్‌ను భారత్‌కు తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తోంది. వివో యు 10 ను ఈ సిరీస్‌లోని మొట్టమొదటి మొబైల్ ఫోనుగా లాంచ్ చేయవచ్చు, ఈ మొబైల్ ఫోన్‌లో వేగంగా ఛార్జింగ్ సపోర్ట్ అందించనున్నట్లు వెల్లడించారు. అమెజాన్ ఇండియాలో ఒక ప్రత్యేకమైన మైక్రోసైట్ ని కూడా దీనికోసం కేటాయించింది. అలాగే, ఈ పేజీలో ఈ ఫోనుకు సంభందించిన కొన్ని ఫీచర్లను గురించి కూడా చెబుతోంది.

అమెజాన్ ఇండియాలో వివో యు 10 మొబైల్ ఫోన్ యొక్క నోటిఫై మి పేజీని సందర్శించడం ద్వారా, ఈ మొబైల్ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందనునట్లు తెలిసింది. అయితే, ఏ స్నాప్‌డ్రాగన్ వెర్షన్‌ను లాంచ్ చేయబోతున్నారనే దానిపై సమాచారం లేదు. ఇది కాకుండా, మీరు ఫోన్‌లో పెద్ద బ్యాటరీని కూడా అందుకొనునట్లు పేర్కొంది.

ఇది కాకుండా, ఈ సిరీస్‌లో వచ్చే ఫోన్‌లను మిడ్ రేంజ్ మరియు ఎంట్రీ లెవల్‌లో తీసుకురావడం ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రత్యేకత కానుంది. ఈ రోజుల్లో, చాలా  స్మార్ట్‌ ఫోన్లలో ఇలాంటి ఫీచర్లు మరియు ధరలు ఉన్నాయి. దీని రూపకల్పన గురించి కొంత సమాచారం కూడా వెల్లడైంది.  ఈ మొబైల్ ఫోన్‌లో డ్యూడ్రాప్ నోచ్ డిస్ప్లే ని ఇచ్చారు.

ఇటీవల, వివో జెడ్ 1 ఎక్స్ మొబైల్ ఫోన్‌ను కూడా భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇది ఒక  6.38-అంగుళాల పూర్తి HD + డిస్ప్లేతో వస్తుంది మరియు దీని రిజల్యూషన్ 1080×2340 పిక్సెల్స్ గా ఉంటుంది. ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లే, పైన వాటర్‌డ్రాప్ నాచ్ తో అందంగా కనిపిస్తుంది మరియు ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్‌తో జత చేసిన స్నాప్‌డ్రాగన్ 712 SoC యొక్క శక్తితో పనిచేస్తుంది. పనితీరును మెరుగుపరచడానికి కంపెనీ మల్టీ-టర్బో మరియు అల్ట్రా గేమ్ మోడ్‌లను కూడా అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo