VIRAT V1 Pro 5G స్టన్నింగ్ న్యూ లుక్ తో రేపు లాంచ్ అవుతుంది .. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
రీసెంట్ గా బడ్జెట్ సెగ్మెంట్ లో విరాట్ వి1 సిరీస్ అందించిన లావా
VIRAT V1 Pro 5G స్టన్నింగ్ న్యూ లుక్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ ను కూడా వెల్లడించింది
ఫ్లిప్ కార్ట్ తో భాగస్వామి ఏర్పరచుకొని రీసెంట్ గా బడ్జెట్ సెగ్మెంట్ లో విరాట్ వి1 సిరీస్ అందించిన లావా, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి Pro స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తోంది. అదే VIRAT V1 Pro 5G స్మార్ట్ ఫోన్ మరియు ఈ స్మార్ట్ ఫోన్ స్టన్నింగ్ న్యూ లుక్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఈరోజు విడుదల చేసిన టీజర్ వీడియో నుంచి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ మరియు ఫీచర్స్ ను కూడా వెల్లడించింది.
SurveyVIRAT V1 Pro 5G : ఫీచర్స్
లావా విరాట్ స్మార్ట్ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ను కూడా ఫ్లిప్ కార్ట్ తో జతగా లాంచ్ చేస్తోంది. అంటే, ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. లాంచ్ కోసం అందించిన టీజర్ వీడియోలో ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ కీలక ఫీచర్స్ కూడా ఈ టీజర్ వీడియో లో వెల్లడించింది.
VIRAT V1 Pro 5G : ఫీచర్స్
లావా రీసెంట్ గా విరాట్ వి1 సిరీస్ ను మొబైల్ మార్కెట్ లో పరిచయం చేసింది. ముందు కేవలం అమెజాన్ తో మాత్రమే సేల్ పార్ట్నర్ గా ఫోన్ లను విడుదల చేసిన లావా, ఈ విరాట్ సిరీస్ కి స్ట్రాటజీ చేంజ్ చేసి ఫ్లిప్ కార్ట్ తో జతగా ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి 5G మరియు 4G రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా ఫీచర్స్ మరియు ప్రైస్ పరంగా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా మంచి అమ్మకాలు కూడా సాధించినట్లు లావా తెలిపింది.

అందుకే, ఇప్పుడు ఇదే సిరీస్ నుంచి ప్రో వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మరింత అందమైన స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లో వెనుక మరింత అందమైన లుక్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది నైట్ మోడ్, పోర్ట్రైట్, HDR మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: QLED Smart Tv deal: కేవలం రూ. 24,000 రూపాయల ఆఫర్ ధరలో 50 ఇంచ్ అందుకోండి.!
ఈ లావా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ స్మూత్ విజువల్స్ అందించే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ బిగ్ స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో పెద్ద 6000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ OS తో కూడా వస్తుంది. ఈ ఫోన్ రేపు లాంచ్ అవుతుంది కాబట్టి ఈ ఫోన్ మరియు రీసెంట్ విరాట్ వి1 ఫోన్ మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసాలు మరియు ప్రైస్ డిఫరెన్స్ తెలుస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
