QLED Smart Tv deal: కేవలం రూ. 24,000 రూపాయల ఆఫర్ ధరలో 50 ఇంచ్ అందుకోండి.!
QLED Smart Tv deal ఈరోజు అందుబాటులో ఉంది
ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ మీరు పరిశీలించ తగిన ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది
కేవలం రూ. 24,000 రూపాయల ఆఫర్ ధరలో 50 ఇంచ్ అందుకోవచ్చు
QLED Smart Tv deal: బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనడమే మీరు టార్గెట్ గా పెట్టుకున్నారా? అయితే, ఈ న్యూస్ కచ్చితంగా మీకోసమే తీసుకొచ్చాము. Flipkart ఫ్రీడమ్ సేల్ ముగిసిన తర్వాత కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ స్మార్ట్ టీవీలను ఫ్లిప్ కార్ట్ మంచి ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. బెస్ట్ డీల్స్ లో భాగంగా ఈరోజు అందించిన ఒక స్మార్ట్ టీవీ ఆఫర్ మీరు పరిశీలించ తగిన ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ స్మార్ట్ డీల్ ఏమిటి మరియు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ ఏమిటో తెలుసుకోండి.
SurveyQLED Smart Tv deal ఏమిటి?
ప్రముఖ జర్మన్ ఆడియో కంపెనీ Blaupunkt క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఈరోజు లభిస్తున్న బెస్ట్ బడ్జెట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ ఈరోజు 26% డిస్కౌంట్ తో కేవలం రూ. 26,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ 50 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై రూ. 2,038 రూపాయల ఫ్లిప్ కార్ట్ Axis అండ్ ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,461 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.
QLED Smart Tv deal : ఫీచర్స్
ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ తో వస్తుంది. ఈ స్క్రీన్ 4K UHD రిజల్యుషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ టీవీ కలిగిన 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఫీచర్ మరియు HDR సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ పని చేస్తుంది మరియు జతగా 2GB ర్యామ్ అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇది బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

ఇక ఈ టీవీ అందించే సౌండ్ విషయానికి వస్తే, ఈ టీవీ రెండు బాస్ స్పీకర్లు కలిగి టోటల్ 48W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, డాల్బీ డిజిటల్ మరియు డాల్బీ ఆడియో వంటి సౌండ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ బ్లౌపంక్ట్ స్మార్ట్ టీవీ మంచి సౌండ్ కూడా ఆఫర్ చేస్తుంది.
Also Read: Jio Prime Membership: అదనపు ప్రయోజనాలను అందించే కొత్త జియో ఆఫర్ గురించి తెలుసా.!
ఇతర ఫీచర్స్ చూస్తే, ఈ టీవీ జియో Tele OS పై నడుస్తుంది. ఇది 400 కంటే అధిక ఉచిత ఛానల్స్ యాక్సెస్ తో వస్తుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ Hello Jio వాయిస్ సపోర్ట్ ఫీచర్ తో 10 కంటే ఎక్కువ భారత ప్రాంతీయ భాషలకు మద్దతు కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని కనెక్టివిటీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
