upcoming smartphone which is ready launch before Flipkart Sale and Amazon Sale
2026 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ అయిన ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ కూడా తమ అప్ కమింగ్ సేల్స్ అనౌన్స్ చేశాయి. Flipkart Sale మరియు Amazon Sale రెండు కూడా ఆగస్టు రెండో వారం చివరిలో ప్రారంభం అవుతాయి. ఈ రెండు ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ కూడా ఈ సేల్ నుంచి గొప్ప డీల్స్ మరియు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించబోతున్నాయి. ఇదే అదనుగా చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా తమ కొత్త స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాయి.
ఫ్లిప్ కార్ట్ Freedom Sale ను అనౌన్స్ చేసింది మరియు ఈ సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం అవుతుంది. అమెజాన్ Great Freedom Sale ని అనౌన్స్ చేసింది మరియు ఈ సేల్ ఆగస్టు 7 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రెండు సేల్ కంటే ముందు చాలా స్మార్ట్ ఫోన్ లు లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే, ఈ ఫోన్లు అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్స్ తో సేల్ కి అందుబాటులోకి తీసుకొచ్చే వీలుంటుంది.
2026 ఆగస్టు మొదటి వారంలో విడుదల కావడానికి మూడు స్మార్ట్ ఫోన్ లు సిద్ధంగా ఉన్నాయి. అవేమిటంటే, Poco M8 Power, OnePlus 6x మరియు Redmi NOTE 17 స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ఈ మూడు స్మార్ట్ ఫోన్ లు కూడా జూలై చివరి వారం మరియు ఆగస్టు మొదటి వారంలో లాంచ్ అవుతాయి మరియు ఈ అప్ కమింగ్ బిగ్ సేల్ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 7000 mAh బిగ్ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, డ్యూయల్ రియర్ కెమెరా మరియు Ai శక్తి కలిగిన కెమెరా వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.
పోకో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన ఎం సిరీస్ నుంచి ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జ్, 22.5W రివర్స్ ఛార్జ్ మరియు ఆకట్టుకునే విజువల్స్ అందించే బిగ్ AMOLED స్క్రీన్ వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.
Also Read : Bank of Baroda Data Leak: ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అండ్ ఒక బ్యాడ్ న్యూస్.!
రెడ్ మీ యొక్క ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కూడా ఆగస్టు మొదటి వారంలో లాంచ్ అవుతుంది. షియోమీ ఈ ఫోన్ ను ఆగస్టు 6వ తేదీ లాంచ్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా 8000 mAh బిగ్ బ్యాటరీ, బిగ్ డిస్ప్లే మరియు డ్యూయల్ రియర్ కెమెరా వంటి ఫీచర్స్ తో లాంచ్ అవుతుంది.
ఇక్కడ సూచించిన మూడు స్మార్ట్ ఫోన్లు కాకుండా మరికొన్ని స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ కోసం రెడీ అవుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు.