Realme 8 Pro: టాప్ 5 ఫీచర్లు

Realme 8 Pro: టాప్ 5 ఫీచర్లు
HIGHLIGHTS

Realme తన కొత్త 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది

108MP క్వాడ్ కెమెరా సెటప్

స్పీడ్ ఛార్జింగ్, సూపర్ AMOLED డిస్ప్లే

Realme తన కొత్త 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో Realme 8 Pro ని మాత్రం భారీ ఫీచర్లతో తక్కువ ధరలో తక్కువ ధరలో విడుదల చేసినట్లు కంపెనీ ప్రకటించింది. వీటిలో, 108MP క్వాడ్ కెమెరా సెటప్, స్పీడ్ ఛార్జింగ్, సూపర్ AMOLED డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లను గురించి చెబుతోంది. అవేమిటో వివరంగా చూద్దాం.            

Realme 8 Pro : టాప్ -5 ఫీచర్లు

1. డిస్ప్లే

ఈ Realme 8 Pro స్మార్ట్ ఫోన్ 6.44 అంగుళాల పరిమాణం గల SuperAMOLED డిస్ప్లే 2400×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ తో మరియు పంచ్ హోల్ డిజైనుతో ఉంటుంది. ఇక దీని డిస్ప్లే యొక్క స్పెషల్ ఫీచర్ విషయానికి వస్తే, ఇది 180Hz టచ్ శాంప్లింగ్ రేటుతో వస్తుంది. అంతేకాదు, ఇది గరిష్టంగా 1000 నిట్స్ బ్రైట్నెస్ అందించగలదు.                                       

2. ప్రాసెసర్

ఈ ఫోన్ మంచి పర్ఫార్మెన్స్ అందించగల, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 720G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్  తో గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇందులో ఉన్న Adreno 618 GPU కారణంగా గ్రాఫిక్స్ కూడా బాగా ఉంటాయి మరియు హెవీ గేమ్స్ కూడా ప్లే చేయవచ్చు.

3. ర్యామ్ & స్టోరేజి

ఈ ఫోన్ను రెండు ర్యామ్ వేరియంట్ ఎంపికలతో ప్రకటించింది. అవి : 6GB ర్యామ్ + 128GB స్టోరేజి మరియు  8GB ర్యామ్ +128GB స్టోరేజి వంటి రెండు వేరియంట్లు . వీటి ధరలు ఈ క్రింద చూడవచ్చు. ర్యామ్ LPDDR4X RAM మరియు స్టోరేజ్ UFS 2.1 తో వుంటుంది. 

Realme 8 Pro : ధరలు

1. Realme 8 Pro : 6GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.17,999/-

2. Realme 8 Pro : 8GB ర్యామ్ + 128GB స్టోరేజి : Rs.19,999/-

4. కెమేరా

Realme ఈ ఫోన్ లో వెనుక క్వాడ్ కెమెరా సెటప్పును అందించింది. ఈ క్వాడ్ కెమెరాలో, f/1.88 ఎపర్చర్ కలిగిన ఒక 108MP Samsung HM2 ప్రధాన కెమెరాని ఇంచింది. రెండవ కెమేరాగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీనికి జతగా 2MP మ్యాక్రో మరియు 2MP B&W  సెన్సార్ ని అందించింది. ఇక సెల్ఫీ కెమేరా కేమెరా విషయానికి వస్తే, ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ వస్తుంది. ఇందులో, ఒక 16MP(f/2.45) సెల్ఫీ కెమెరా ఇచ్చింది. ఈ కెమెరా Sony IMX471 సెన్సార్ తో అందించింది.  ఈ కెమేరాతో మీరు మంచి  సెల్ఫీ ఫోటోలు మరియు స్లో మోషన్ వీడియోలను కూడా తీయ్యోచ్చు.

5. బ్యాటరీ

ఈ Realme 8 Pro ఒక 4,500mAh బ్యాటరీతో వుంటుంది. అయితే , ఈ ఫోన్ యొక్క బ్యాటరీని చాలా వేగవంతమైన 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో పాటుగా, బాక్స్ లోనే ఒక 65W ఫాస్ట్ ఛార్జర్ ని కూడా అందించింది. ఈ వేగవంతమైన ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో చాలా వేగంగా బ్యాటరీని ఛార్జ్ చెయ్యొచ్చు.              

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo