రేపే షావోమి రెడ్మి నోట్ 9 ప్రో మొదటి సేల్

రేపే షావోమి రెడ్మి నోట్ 9 ప్రో మొదటి సేల్
HIGHLIGHTS

ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది.

ఇటివల షావోమి ఇండియాలో విడుదల చేసినటువంటి, Redmi Note 9 Pro యొక్క మొదటి సేల్ రేపు జరగనుంది. ఈ రెడ్మి నోట్ 9 ప్రో  లో కొత్త డిజైన్ మరియు కొత్త ఫీచర్లను కూడా జత చేసినట్టు విడుదల కార్యక్రమంలో కంపెనీ పేర్కొంది. రెడ్మి నోట్ 9 ప్రో ని రూ.12,999 రూపాయల ప్రారంభధరతో విడుదల చేసింది. ఏ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ మరియు mi.com ద్వారా జరగనుంది. 

రెడ్మి నోట్ 9 ప్రోధరలు :                        

1. రెడ్మి నోట్ 9 ప్రో ( 4GB +64GB ) -Rs.12,999

2. రెడ్మి నోట్ 9 ప్రో ( 6GB +128GB ) -Rs.15,999

రెడ్మి నోట్ 9 ప్రో : ప్రత్యేకతలు

ఈ రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోను, ఒక 6.67 అంగుళాల పరిమాణంగల డాట్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది 2400×1080 పిక్సెళ్ళు అంటే FHD+ రిజల్యూషన్ తో వస్తుంది మరియు గరిష్టంగా 450 నిట్స్ బ్రైట్నెస్ అందిచే సామర్ధ్యంతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క ప్రొటెక్షన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్,  కొత్త ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 720G SoC శక్తితో పనిచేస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ తో వస్తుంది మరియు వేగంగా పనిచేస్తుంది. ఇది 618GPU తో వస్తుంది కాబట్టి గ్రాఫిక్స్ బాగా అనిపిస్తాయి మరియు గేమింగ్ మరింత ఆహ్లాదంగా ఉంటుంది. రెడ్మి నోట్ 9 ప్రో 4GB +64GB మరియు 6GB + 128GB వేరియంట్లలో లభిస్తుంది. 

ఇక కెమేరాల విషయానికి వస్తే, రెడ్మి నోట్ 9 ప్రో వెనుక 48MP+8MP+5MP+2MP గల క్వాడ్ కెమేరా సెటప్పుతో వస్తుంది. ఇందులో 48MP ప్రధాన కెమేరా కాగా, 8MP వైడ్ యాంగిల్, 5MP మ్యాక్రో మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్లతో జతగా వస్తుంది. ఇక ముందుభాగంలో, రెడ్మి నోట్ 9 ప్రో ముందుభాగంలో 16MP సెల్ఫీ కెమేరాని అందించింది. రెడ్మి నోట్ 9 ప్రో ఒక 5020mAh బ్యాటరీని, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది మరియు 18W ఛార్జర్ ని బాక్సుతో పాటుగా తీసుకువస్తుంది. ఈ ఫోన్ లేటెస్ట్ MIUI 11 స్కిన్ పైనఆండ్రాయిడ్ 10 తో విడుదల చేసింది.   

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo