రేపు 48MP క్వాడ్ కెమేరాతో 10 వేల ధరలో వచ్చిన Realme 5s మొదటి సేల్

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ కొంత వైవిధ్యంగా ఉంటుంది.

రేపు 48MP క్వాడ్ కెమేరాతో 10 వేల ధరలో వచ్చిన Realme 5s మొదటి సేల్

ఇటీవల, రియల్మీ తన REALME 5s స్మార్ట్ ఫోన్నుఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక ప్రధాన 48MP సెన్సారు గల క్వాడ్ కెమేరా సెటప్పుతో, కేవలం బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది. వాస్తవానికి, రియల్మీ5 సిరీస్ నుండి వెనుక నాలుగు కెమేరాలతో వచ్చినటువంటి, రియల్మీ5 మాదిరిగానే ఈ ఫోన్ కూడా అటువంటి ప్రత్యేకతలతోనే వచ్చింది. కానీ, కెమేరాల పరంగా ఈ స్మార్ట్ ఫోన్ కొంత వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో ఒక 48MP ప్రధాన కెమెరాను ఇవ్వడం పెద్ద మార్పుగా చెప్పొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి flipkart మరియు realme.com నుండి జరుగనుంది.            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 5s  ధరలు

1. Realme 5s  (4GB + 64GB) ధర – Rs.9,999

2. Realme 5s  (4GB + 128GB) ధర – Rs.10,999  

Realme 5 :  ప్రత్యేకతలు

 ఈ Realme 5s స్మార్ట్ ఫోన్, ఒక 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ అతి చిన్నని నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్ఫోన్ 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తుంది. అలాగే, వెనుక భాగంలో సరికొత్తగా ఒక క్రిస్టల్ డిజైన్ అందించింది. ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక స్నాప్డ్రాగెన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరుతో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా, 2.0GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది దీని జతగా 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి ఎంపికలతో ఎంచుకోవచ్చు.

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక క్వాడ్ కెమేరా సెటప్పును  అందించింది. ఒక ప్రధాన 48MP (samsung GM1) కెమేరాతో కూడిన క్వాడ్ రియర్ కెమెరా ఇందులో ఇవ్వబడింది. అలాగే, ఇది 8MP వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్ కి జతగా 2MP మాక్రో కెమేరా కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన కెమేరాతో 10X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 13 MP  సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఇది క్రిస్టల్ బ్లూ , క్రిస్టల్ పర్పల్ మరియు క్రిస్టల్ రెడ్ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది. ఈ ఫోన్, కలర్ OS 6 స్కిన్ తో ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారితంగా నడుస్తుంది.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile