రెడ్మి 8A డ్యూయల్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ : ధర స్పెక్స్ మరియు మరిన్ని వివరాలు …

షావోమి సంస్థ ఈ రోజు తన మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ను, డ్యూయల్ కెమేరా, పెద్ద బ్యాటరీ మరియు గూగుల్ లెన్స్ వంటి మరిన్ని ప్రత్యేకతలతో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ను, భారతీయ బడ్జెట్ వినియోగదారులకు సరిపోయే విధంగా తీసుకొచ్చినట్లు షావోమి తెలిపింది మరియు ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ ఫిబ్రవరి 10 న మధ్యాహ్నం 12 గంటలకి flipkart మరియు mi.com నుండి చేయనున్నట్లు కూడా ప్రకటించింది.                

Redmi 8A Dual ధర

Redmi 8A Dual   (2GB+32GB)  ధర : Rs.6,499/-

Redmi 8A Dual   (3GB+32GB)  ధర : Rs.6,999/-

రెడ్మి 8A :స్పెసిఫికేషన్స్

ఈ రెడ్మి 8A  డ్యూయల్ – సిమ్  స్మార్ట్ ఫోన్ మరియు 1520x720P పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 6.22 అంగుళాల HD+  డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో  అందించబడింది.  ఈ ఫోన్ గరిష్టంగా 2.0GHz క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు దీనికి జతగా 2GB/3GB ర్యామ్ తో వస్తుంది. ఇది రెండువేరియంట్లలో కూడా 32GB స్టోరేజి కలిగివుంటుంది. ఒక డేడికేటెడ్ మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజిని కూడా పెంచుకోవచ్చు.       

ఈ స్మార్ట్ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ రియర్ కెమెరాని ఒక 13MP ప్రధాన కెమెరా మరియు మరొక 2MP డెప్త్ సెన్సింగ్ కెమరాతో అందించింది.  అలాగే,  ముందు భాగంలో సెల్ఫీల కోసం 8MP  కెమెరా ఉంటుంది. ఇక ఈ ఫోన్ను బలమైన 5,000 mAh బ్యాటరీతో మరియు 18W స్పీడ్ ఛార్జింగ్ సపోర్టుతో తీసుకొచ్చింది. అయితే, సెక్యూరిటీ పరంగా ఫేస్ అన్లాక్ ని మాత్రమే అందించింది. ఇది మిడ్ నైట్ గ్రే , సి బ్లూ మరియు స్కై వైట్ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.                     

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :