ఈరోజు సూపర్ ఫీచర్లతో ఇండియాలో లాంచ్ కానున్న రెడ్మి K20 మరియు K20 ప్రో

Updated on 17-Jul-2019
HIGHLIGHTS

ఈ ఫోన్లు గొప్ప ప్రాసెసర్ మరియు బెస్ట్ కెమేరాలతో రానున్నాయి.

షావోమి, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తన రెడ్మి K20 సిరీస్ నుండి రెడ్మి K20 మరియు రెడ్మీ K20 ప్రో ని కూడా ఇండియాలో విడుదల చేయనుంది. ముందుగా, చైనాలో విడుదల చేసిన ఈ రెండు ఫోన్ల యొక్క స్పెక్స్ దాదాపుగా ఒకే విధంగా వుంటాయి కానీ,  ఈ రెండు ఫోన్ల యొక్క ప్రాసెసరులో మాత్రం కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ ఫోన్లు గొప్ప ప్రాసెసర్ మరియు బెస్ట్ కెమేరాలతో రానున్నాయి. 

Redmi K20 Pro  మరియు Redmi K20 :  ప్రత్యేకతలు (చైనా వేరియంట్)

షావోమి ఈ రెడ్మి K20 ప్రో లో 7 వ తరం ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. రెడ్మి K20 మరియు K20 ప్రో స్మార్ట్ ఫోన్లు రెండు కూడా NFC మద్దతుతో వస్తాయి. Redmi K20 ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని అందించింది.  

ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే HDR కంటెంటుకు  మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్  ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది.అయితే,  రెడ్మి K20 మాత్రం ఒక స్నాప్డ్రాగెన్ 730 చిప్సెట్టుతో వస్తుంది

రెడ్మి K20 సిరీస్ ఫోన్లలో ట్రిపుల్ కెమేరాని అందించింది రెండు ఫోన్లలో, సోనీ IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇవ్వబడింది. ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్  లెన్స్ కలిగి ఉంది. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 మెగాపిక్సెల్స్ పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఇందులో, 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh,బ్యాటరీని ఇచ్చింది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :