షావోమి యొక్క స్నాప్ డ్రాగన్ 855 SoC గేమింగ్ ఫోన్ Black Shark 2 మొదటి సేల్ ఈ రోజే : ధర, ఆఫర్లు మరియు ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్, లేటెస్ట్ మరియు అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుతో వస్తుంది.
ఒక పెద్ద 12GB ర్యామ్ జతగా ఇది చాలా స్పీడుగా పనిచేస్తుంది.
ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన నిర్వహిస్తోంది.
షావోమి సంస్థ, ముందుగా చైనాలో గేమింగ్ ప్రియులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకమైన ఫీచర్లతో తీసుకొచ్చినటువంటి ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ షావోమి బ్లాక్ షార్క్ 2 ను, ఇండియాలో విడుదల కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, లేటెస్ట్ మరియు అత్యంత వేగవంతమైన ప్రాసెసర్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుతో వస్తుంది. అంతేకాదు, ఒక పెద్ద 12GB ర్యామ్ జతగా ఇది చాలా స్పీడుగా పనిచేస్తుంది. ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart తన ఆన్లైన్ ప్లాట్ఫారం పైన నిర్వహిస్తోంది.
షావోమి బ్లాక్ షార్క్ 2 : ధరలు
షావోమి బ్లాక్ షార్క్ 2 ( 6GB + 128GB ) – Rs. 39, 999
షావోమి బ్లాక్ షార్క్ 2 ( 12GB + 256GB ) – Rs. 49, 999
షావోమి బ్లాక్ షార్క్ 2 ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఒక మంచి రిజల్యూషన్ మరియు చక్కని వ్యూ అందించగల ఒక 6.39 అంగుళాల ట్రూ వ్యూ AMOLED డిస్ప్లేతో మరియు HDR సపోర్టుతో వస్తుంది. అంతేకాదు, ఈ అమోలెడ్ డిస్ప్లే ఇండిపెండెంట్ ఇమేజ్ ప్రాసెసింగ్ తో పాటుగా వస్తుంది. దీనితో గేమింగ్ సమయంలో మీకు చక్కని కలర్స్ మరియు డీప్ బ్లాక్ వాటి ఫీచర్లతో గొప్ప గేమింగ్ వ్యూ అనుభూతిని ఇస్తుంది. ఇక ఒక గేమింగ్ ఫోనులో కావాల్సిన గొప్ప ప్రాసెసర్ కూడా ఇందులో అందించారు. ఇది స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ ప్రాసెసెరుకి జతగా, గరిష్టంగా 12GB ర్యామ్ తో వస్తుంది. కాబట్టి, అవధులులేని గేమింగ్ స్పీడ్ అందుకోవచ్చు మరియు ఇందులో అందించిన డైరెక్ట్ టచ్ మల్టి లేయర్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ తో ఫోన్ చల్లగా ఉండేలా చూస్తుంది.
ఇక కెమేరా విభాగానికి వస్తే, ఇందులో ఒక 48MP సెన్సార్ కలిగినటువంటి ప్రధాన కెమేరాకి జతగా మరొక 12MP కెమెరాని జతగా చేసిన డ్యూయల్ కెమేరా అందించారు. అలాగే ముందుభాగంలో ఒక 20 MP సెల్ఫీ కెమేరాని కూడా ఇందులో ఇచ్చారు. ఇక ఈ ఫోనుకు తగినట్లుగా, వేగంగా ఛార్జ్ చేయగల సాంకేతికతతో కూడిన 4,000 mAh బ్యాటరీ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ప్రత్యేకతలతో ఉంటుంది. ముఖ్యంగా, ఇందులో అందించిన ఒక ప్రత్యేకమైన సాంకేతికతతో మీరు ఆడే గేమ్ ను మీ టీవీతో కనెక్ట్ చేసుకొని నేరుగా అందులోనే ఆడవచ్చు. అందుకోసం, ఈ ఫోన్ను ఒక HDMI కేబుల్ తో కనెక్ట్ చేసుకొని బ్లాక్ షార్క్ గేమింగ్ కన్సోల్ 2.0 తో కనెక్ట్ చేయసి ఉంటుంది. ఇక మీ గేమింగ్ పెద్ద స్క్రీన్ పైన ఎంజాయ్ చెయ్యవచు.