నేడు 1,000 రూపాయల డిస్కౌంట్ అఫర్ తో జరగనున్న Redmi Note 8 Pro ఫ్లాష్ సేల్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 18 Dec 2019
నేడు 1,000 రూపాయల డిస్కౌంట్ అఫర్ తో జరగనున్న Redmi Note 8 Pro ఫ్లాష్ సేల్

New Vostro 14 5490 Laptop with 10th Generation Intel core process

It has a RAM of 8GB and 2GB GDDR5 graphics memory. Save Rs.17,000 on this deal

Click here to know more

HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది.

షావోమి మంచి గేమింగ్ మరియు కెమేరా ఫీచర్లతో, కేవలం రూ.14,999 రుపాయల బడ్జెట్ ధరలో  తీసుకొచ్చినటువంటి REDMI NOTE 8 PRO యొక్క మరొక ఫ్లాష్ సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి అమేజాన్ ఇండియా మరియు Mi.com నుండి జరగనుంది. ఈ ఫోన్ కేవలం గేమింగ్ కోసం మాత్రమే కాకూండా కెమేరాల పరంగా కూడా చాలా మంచి ప్రత్యేకతలతో వస్తుంది. అధనంగా, ఈ ఫోన్ పైన ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు మరియు EMI ఎంపికలతో కొనుగోలు చేసేవారికి 1,000 రూపాయల తక్షణ డిస్కౌంట్ ఆఫరును కూడా అందిస్తోంది.     

రెడ్మి నోట్ 8 ప్రో  : ధరలు

1. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +64GB ) - Rs.14,999/-

2. రెడ్మి నోట్ 8 ప్రో (6GB +128GB ) - Rs.15,999/-

3. రెడ్మి నోట్ 8 ప్రో (8GB +128GB ) - Rs.17,999/

రెడ్మి నోట్ 8 ప్రో ప్రత్యేకతలు

రెడ్మి నోట్ 8 ప్రో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్ కలిగి యాస్పెక్ట్ రేషీతో వస్తుంది మరియు ఈ డిస్ప్లే ఒక కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణతో ఉంటుంది. ఇక వెనుక భాగంలో ఇది 3D కర్వ్డ్ గ్లాస్ తో వస్తుంది.  ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని సరికొత్తగా చూడనున్నారు. అదనంగా, ఇందులో గేమింగ్ కోసం మీడియా టెక్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తోఈ స్మార్ట్ శక్తినిస్తుంది.మరొక కొత్త విషయం ఏమిటంటే, ఈ స్మార్ట్ ఫోన్ Alexa Built-ఇన్ తో వస్తుంది మరియు ఇండియాలో ఈ ప్రత్యేకతతో వచ్చిన మెట్టమొదటి స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది.

ఇక కెమేరాల విషయానికి వస్తే, ఈ రెడ్మి నోట్ 8 ప్రో మొబైల్ ఫోనులో గరిష్టంగా ఒక  64 MP సెన్సార్ గల క్వాడ్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ ప్రధాన కెమేరాకి జతగా ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సారుతో పాటుగా ఒక మరియు  కెమెరాను అందించింది, ఇది ఎఫ్ / 1.7 ఎపర్చర్‌తో లభిస్తుంది. ఇది కాకుండా, మీరు ఈ ఫోన్లో 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. అలాగే, ఈ మొబైల్ ఫోన్‌లో, అంటే రెడ్మి నోట్ 8 ప్రోలో,ఒక 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా ఇచ్చింది. అలాగే, బాక్సుతో పాటుగా ఒక 18W చార్జరును అందించారు.                         

logo
Raja Pullagura

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements
Advertisements

టాప్ -ప్రోడక్టులు

హాట్ డీల్స్

మొత్తం చూపించు

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.