2020 లో ముందుగా ఆండ్రాయిడ్ 10 అందుకోనున్న Relame స్మార్ట్ ఫోన్స్

2020 లో ముందుగా ఆండ్రాయిడ్ 10 అందుకోనున్న Relame స్మార్ట్ ఫోన్స్
HIGHLIGHTS

రియల్మీ యొక్క 11 స్మార్ట్ ఫోన్లు ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకోనున్నాయి.

తన స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 10 యొక్క అప్డేట్ వివరాలను అందించింది. ప్రస్తుతం, వరుసగా తన స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తున్న రియల్మీ సంస్థ, ఆ స్మార్ట్ ఫోన్లకు ఆండ్రాయిడ్ ప్రధాన అప్డేట్ ను అందించాడని కూడా రోడ్ మ్యాప్ ను అందించింది. వాస్తవానికి, ఈ జాబితాలో రియల్మీ యొక్క 11 స్మార్ట్ ఫోన్లు ఈ ఆండ్రాయిడ్ 10 అప్డేట్ అందుకోనున్నాయి. ఈ జాబితాలోని స్మార్ట్ ఫోన్లను క్రింద చూడవచ్చు.             

ఈ అప్‌డేట్ రియల్మి 2 ప్రో నుండి రియల్మి ఎక్స్ 2 ప్రో వరకు పలు రకాల స్మార్ట్‌ ఫోన్లకు అందుబాటులోకి తేనుంది . వీటిలో, రియల్మీ 3 ప్రో, రియల్మి X, రియల్మి 5 ప్రో, రియల్మి ఎక్స్‌టి  వంటి స్మార్ట్ ఫోన్లు 2020 Q 1 లో ఆండ్రాయిడ్ 10 కి అప్‌ డేట్ అవుతాయి. అయితే ఆశ్చర్యకరంగా, లేటెస్ట్ గా వచ్చిన రియల్మి 5  స్మార్ట్ ఫోన్ మాత్రం 2020 Q 2 లో ఆండ్రాయిడ్ 10 కు అప్‌ డేట్ లభిస్తుంది. ఇక, రియల్మి 2 ప్రో ఫోనులో మాత్రం 2020 Q 3 లో ఆండ్రాయిడ్ 10 రన్ చేయడానికి ప్లాన్ చేయబడింది.

అయితే, ఇటీవల ఒప్పో తన ఆండ్రాయిడ్ 10 ఆధారితంగా Color OS7 నీ ప్రకటించిన విషయం తెలిసిందే, ఈ Color OS 7 కష్టం UI తో  ఈ ఆండ్రాయిడ్ 10 ఈ ఫోన్లలో అప్డేట్ చేయబడుతుంది. అయితే, 2018 సంవత్సరంలో మంచి ప్రత్యేకతలతో వచ్చినటువంటి, రియల్మీ 1, రియల్మీ U1, రియల్మీ C1, మరియు రియల్మీ 2 స్మార్ట్ ఫోన్ల కోసం ఈ ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్ ను ప్రకటించక పోవడం మాత్రం ఆ వినియోగదారులకు కొంత నిరాశపరిచేగా ఉంటుంది.                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo