అతిపెద్ద 10,000 mAh బ్యాటరీతో వచ్చిన Gionee M 30 స్మార్ట్ ఫోన్

అతిపెద్ద 10,000 mAh బ్యాటరీతో వచ్చిన Gionee M 30 స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

Gionee M 30 స్మార్ట్ ఫోన్‌ అతిపెద్ద 10,000 mAh బ్యాటరీతో లాంచ్ అయ్యింది.

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం మిడ్-రేంజ్ ధరలో లంచ్ చెయ్యబడింది.

కేవలం 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్‌ తో మాత్రమే Gionee M 30 స్మార్ట్ ఫోన్ వచ్చింది.

Gionee M30 స్మార్ట్ ఫోన్‌ అతిపెద్ద 10,000 mAh బ్యాటరీతో చైనాలో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం మిడ్-రేంజ్ ధరలో లంచ్ చెయ్యబడింది. అయితే,  కేవలం 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ గల సింగిల్ వేరియంట్‌ తో మాత్రమే Gionee M30 స్మార్ట్ ఫోన్ వచ్చింది. అలాగే, ఈ మొబైల్ ఫోన్ ‌లో మీకు మొత్తంగా రెండు కెమెరాలు మాత్రమే ఉంటాయి, ఒకటి ఫోన్ ముందు భాగంలో మరియు ఒక కెమెరా ఫోన్ వెనుక భాగంలో ఉంది.

Gionee M30 ధర

Gionee M 30స్మార్ట్‌ ఫోన్ చైనాలో CNY 1,399 ధరతో తీసుకురాబడింది, ఇది మన భారతీయ రూపాయితో పోల్చి చూస్తే , అది రూ .15 వేల వరకు వుంటుంది.

Gionee M30 ఫీచర్లు

Gionee M30 స్మార్ట్‌ ఫోన్ ఒక 6 అంగుళాల HD + ఎల్‌సిడి స్క్రీన్ తో వుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో పి 60 ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది.  అయితే, ఈ ఫోన్‌ కేవలం 8 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ సింగిల్ వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఈ మొబైల్ ఫోన్‌లో చాలా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ మొబైల్ ఫోన్‌లో 10,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. ఇది ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇవ్వబడింది.

ఫోటోగ్రఫీ మొదలైన వాటి కోసం జియోనీ ఎం 30 స్మార్ట్ ‌ఫోన్ ‌లో రెండు కెమెరాలు మాత్రమే ఉంటాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో ఒక కెమెరా ఉంది మరియు మరొకటి ముందు భాగంలో వుంటుంది. జియోనీ ఎం 30 స్మార్ట్ ‌ఫోన్ ‌లో మీకు 8 ఎంపి ఫ్రంట్ కెమెరాతో పాటు 16 MP వెనుక కెమెరా మాత్రమే లభిస్తుంది. మీరు ఈ మొబైల్ ఫోన్‌ లో వేలిముద్ర సెన్సార్‌ ను కూడా చూడవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo