16MP+5MP+2MP మరియు పంచ్ హోల్ సెల్ఫీ తో కేవలం రూ.9,999 ధరతో వచ్చిన టెక్నో కెమోన్ 12 ఎయిర్ ఫోన్

16MP+5MP+2MP మరియు పంచ్ హోల్ సెల్ఫీ తో కేవలం రూ.9,999 ధరతో వచ్చిన టెక్నో కెమోన్ 12 ఎయిర్ ఫోన్
HIGHLIGHTS

ఈ కొత్త మొబైల్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P 22 SoC చేత శక్తిని కలిగి ఉంది

భారతదేశంలో CAMON 12 Air  ను ఒక పంచ్ హోల్ డిస్ప్లే డిజైనుతో, టెక్నో తీసుకొచ్చింది. ఈ టెక్నో కేమాన్ 12 ఎయిర్ యొక్క ప్రత్యేక లక్షణం దానిలోని పంచ్-హోల్ డిస్ప్లే, ఎందుకంటే ఇది బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్, కేవలం ఈ బడ్జెట్ ధరలో అతివంటి డిస్ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లేకు కంపెనీ డాట్-ఇన్-డిస్ప్లే అని పేరు పెట్టింది. ఆఫ్‌ లైన్ విభాగంలో, ఈ రకమైన డిస్ప్లే కలిగిన స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు మంచి విషయం. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ హిలియో P 22 సోసి, 4 జిబి ర్యామ్ మరియు 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో టెక్నో కామన్ 12 ఎయిర్ ఫోన్ను కంపెనీ ప్రవేశపెట్టింది.

భారతదేశంలో టెక్నో కెమోన్ 12 ఎయిర్ ధర

టెక్నో కెమోన్ 12 ఎయిర్ ధర భారతదేశంలో కేవలం రూ .9,999 ధరతో మరియు ఆఫ్‌ లైన్ రిటైల్ దుకాణాల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను బే బ్లూ, స్టెల్లార్ పర్పుల్ కలర్‌లో కంపెనీ విడుదల చేసింది.

టెక్నో కామన్ 12 ఎయిర్ స్పెసిఫికేషన్స్

డ్యూయల్-సిమ్ టెక్నో కెమోన్ 12 ఎయిర్ ఆండ్రాయిడ్ 9 ఆధారంగా HiOS 5.5 పై పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఒక 6.55-అంగుళాల HD + డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ మరియు 20: 9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఈ కొత్త మొబైల్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P 22 SoC చేత శక్తిని కలిగి ఉంది మరియు ఇది 4GB RAM తో జత చేయబడింది.

టెక్నో కెమోన్ 12 ఎయిర్ ట్రిపుల్ కెమెరాతో లాంచ్ చేయబడింది మరియు ఫోన్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను f / 1.8 ఎపర్చరుతో కలిగి ఉంది, మరియు రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ సెన్సార్, ఇది 2.5 సెం.మీ మాక్రో షాట్లు తీసుకోవచ్చు మరియు మూడవ కెమెరా 5 మెగాపిక్సెల్ 120 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్. కెమెరా సెటప్‌తో టెక్నో క్వాడ్-ఎల్‌ఈడీ మాడ్యూల్‌ను కూడా జోడించింది. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది మరియు ఈ కెమెరా 81 డిగ్రీల వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోగలదు.

టెక్నో కే మోన్ 12 ఎయిర్ 64 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది, ఇది మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు పెంచుకోవచ్చు. ఇవి కాకుండా, 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v5.0, మరియు GPS / A-GPS కనెక్టివిటీ కోసం ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరం వెనుక భాగంలో యాంటీ ఆయిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంచబడింది, దీని గురించి చుస్తే, ఈ పరికరం 0.27 సెకన్లలో పరికరాన్ని అన్‌లాక్ చేయగలదని మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఫోన్‌లో చేర్చబడిందని కంపెనీ తెలిపింది. ఫోన్‌లో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo