Tecno Pova 8 5G sale started with deals and offers today
Tecno Pova 8 5G: టెక్నో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పోవా 8 5జి సేల్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ స్మార్ట్ ఫోన్ 8000 mAh బిగ్ బ్యాటరీ, సెకండరీ డాట్ మాట్రిక్స్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ అండ్ బిగ్ కూలింగ్ సిస్టమ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదలైన ఈ ఫోన్ మంచి ఆఫర్లతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనే ముందు ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రైస్ అండ్ ఆఫర్స్ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
టెక్నో పోవా 8 5జి స్మార్ట్ ఫోన్ బేసిక్ (6GB + 128GB) వేరియంట్ ను రూ. 29,999 ధరతో మరియు 8GB + 128GB వేరియంట్ ను రూ. 31,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ 16 బిట్ వైట్ మరియు టర్మినల్ గ్రీన్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ ఫోన్ పై టెక్నో అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ ను SBI, ICICI, HDFC మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ రూ. 28,499 ధరలో ఈ ఫోన్ లభిస్తుంది.
Also Read: Claude AI Down: సర్వీస్ పూర్తిగా డౌన్ అయినట్లు భారీగా ఫిర్యాదు నమోదు చేసిన యూజర్లు.!
టెక్నో పోవా స్మార్ట్ ఫోన్ లో 6.76 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ని టెక్నో అందించింది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్ మరియు మంచి బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది, డిజైన్ పరంగా, ఈ స్మార్ట్ ఫోన్ దృఢమైన MIL-STD 810 H సర్టిఫికేషన్ మరియు IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అదనంగా, ఈ ఫోన్ ప్రత్యేకమైన “Alive Matrix Display” LED బ్యాక్ ప్యానెల్ తో కూడా వస్తుంది. ఈ సెటప్ ష ఈ ఫోన్ ప్రీమియం లుక్స్ తో ఆకట్టుకుంటుంది.
ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7100 5G చిప్ సెట్ తో టెక్నో అందించింది. ఈ చిప్ సెట్ తో జతగా 8జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ ని కూడా అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 16 ఆధారిత Hi OS 16 సాఫ్ట్ వేర్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు కూడా కలిగి ఉంటుంది.
కెమెరా పరంగా, 50MP (Sony LYT 600) ప్రధాన కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో AI CAM, AIGC Portrait వంటి ఏఐ కెమెరా ఫీచర్స్ తో పాటు మంచి వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ భారీ 8000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు మంచి లాంగ్ లైఫ్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.