10 వేల బడ్జెట్ ధరలో 7,000 mah హెవీ బ్యాటరీతో వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్

10 వేల బడ్జెట్ ధరలో 7,000 mah హెవీ బ్యాటరీతో వచ్చిన కొత్త స్మార్ట్ ఫోన్
HIGHLIGHTS

7,000 mah హెవీ బ్యాటరీతో వచ్చిన టెక్నో పోవా 2

పెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్

మీడియా టెక్ హీలియో G85 చిప్ సెట్

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ Tecno తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Tecno Pova 2 ని ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలోనే భారీ 7,000 mAh బ్యాటరీతో మరియు మరిన్ని ఫీచర్లతో వచ్చింది. కస్టమర్ల అవసరాన్ని బట్టి ఎక్కువ సమయం నిలిచివుండేలా పెద్ద బ్యాటరీ స్మార్ట్ ఫోన్ అందించే లక్ష్యంతో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినట్లు టెక్నో పేర్కొంది. మరి ఈ బిగ్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్  Tecno Pova 2 యొక్క ప్రైస్, స్పెషిఫికేషన్స్ మరియు ఫీచర్లను  గురించి తెలుసుకుందామా.

Tecno Pova 2: ప్రైస్

ఈ టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వాటిలో బేసిక్ వేరియంట్ 4GB+64GB స్టోరేజ్ తో రూ.10,499 ధరతో,  6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499 రూపాయల ప్రైస్ తో ప్రకటించింది. అయితే, ఈ ధరలు లాంచ్ అఫర్ క్రింద ప్రకటించబడ్డాయి. అంటే, పరిమిత సమయం మాత్రమే ఈ ధరను అఫర్ చేస్తుంది. వాస్తవానికి, వీటి ధరలు 4GB+64GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999 కాగా 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,999 రూపాయలు.

 Tecno Pova 2: స్పెక్స్

టెక్నో పోవా 2 స్మార్ట్ ఫోన్ 6.95 అంగుళాల పెద్ద స్క్రీన్ ను డాట్ ఇన్ డిస్ప్లే మరియు FHD+ రిజల్యూషన్ కలిగి వుంటుంది. ఈ లేటెస్ట్ టెక్నో స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో G85 చిప్ సెట్ తో పనిచేస్తుంది మరియు 4GB / 6GB వేరియంట్లలో అందించబడుతుంది. అధనపు స్టోరేజ్ కోసం మైక్రో SD కార్డు అప్షన్ ను కూడా అందించింది.

ఈ ఫోన్ వెనుక క్వాడ్  కెమెరా సెటప్ ను ఆకర్షణీయంగా కనిపించే డిజైన్ తో తీసుకొచ్చింది. ఈ సెటప్ లో 48MP ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లు వున్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో వున్న పంచ్ హోల్ కటౌట్ లో 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ కెమెరా మంచి ఫోటోలు వంటి వీడియోలను అందించ గల శక్తితో ఉంటుందని కంపెనీ చెబుతోంది.

ఇక ఈ ఫోన్ గురించి చెప్పాల్సిన  ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫోన్ యొక్క బ్యాటరీ. ఎందుకంటే, ఈ టెక్నో స్మార్ట్ ఫోన్ అతిపెద్ద 7,000 mAh పవర్ బ్యాటరీని కలిగివుంది. అంతేకాదు, ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చెయ్యడానికి వీలుగా Double IC 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగివుంది. అధనంగా, గేమ్ స్పేస్ 2.0, గేమ్ వాయిస్ ఛేంజర్, సిస్టమ్ టర్బో 2.0 వంటి ఫీచర్లు కూడా Tecno ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించింది. 

టెక్నో స్పార్క్ 7 ప్రో పెద్ద 5,000 mAh బ్యాటరీని 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఈ ఫోన్ HiOS 7.5 స్కిన్ పైన ఆండ్రాయిడ్ 11 తో పనిచేస్తుంది. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫాస్ట్ కనెక్టివిటీ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆల్ప్స్ బ్లూ, స్ప్రూస్ గ్రీన్ మరియు మ్యాగ్నెట్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo