టెక్నో తన అప్ కమింగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ టీజర్ విడుదల చేసింది. Tecno Spark 9 పేరుతొ తీసుకువస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన స్పెక్స్ మరియు అంచనా ధరలను కూడా కంపెనీ వెల్లడించడం విశేషం. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కేవలం 10 వేల కంటే తక్కువ ధరకే 11GB వరకూ ఉండేలా వర్చువల్ ర్యామ్ తో తీసుకువస్తునట్లు టెక్నో ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 128GB వరకూ స్టోరేజ్ ను కూడా ఆఫర్ల చేయనున్నట్లు పేర్కొంది. ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుసుకోవాల్సిన విషయాలు ఇవే.
Survey
✅ Thank you for completing the survey!
Tecno Spark 9 ను త్వరలో లాంచ్ చేయనున్నట్లు టెక్నో ప్రకటించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క లాంచ్ తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ లో అందించిన కొన్ని కీలకమైన స్పెక్స్ మరియి ఫీచర్లను మాత్రం టీజింగ్ ద్వారా తెలిపింది. టెక్నో స్పార్క్ 9 కోసం అమెజాన్ ఇప్పటికే మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. కాబట్టి, ఈ ఫోన్ అమెజాన్ ద్వారా సేల్ కి వస్తుందని మనం అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క వెల్లడైన వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ 6.6-ఇంచ్ HD డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 5GB టోటల్ 11GB ర్యామ్ వరకు కలిగి ఉంటుందని దీనికి జతగా 128GB స్టోరేజ్ కూడా జత చేయబడుతుందని కూడా ప్రకటించింది. Tecno Spark 9 లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12OS తో లాంచ్ చేయబడుతుంది మరియు 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఇన్ఫినిటీ బ్లాక్ మరియు స్కై మిర్రర్ అనే రెండు అక్షర్షణీయమైన కలర్ అప్షన్లలో వస్తుంది.
ఇక ఈ ఫోన్ కెమెరాల పరంగా చూస్తే, టెక్నో స్పార్క్ 9 లో డ్యూయల్ కెమెరా సెటప్ తో కనిపిస్తోంది. అక్కని ఈ ఫోన్ కెమెరాల గురించి కంపెనీ ఇంకా అధికారికముగా ప్రకటించ లేదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile