కేవలం రూ.5,499 ధరతో విడుదలైన Tecno Spark GO : దీనితో బ్లూటూత్ ఇయర్ పీస్ ఉచితంగా అందిస్తోంది.

Updated on 30-Aug-2019
HIGHLIGHTS

ఒక సంవత్సరం లోపు 1 టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా అందిస్తోంది.

టెక్నో సంస్థ, బడ్జెట్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని, Tecno Spark GO స్మార్ట్ ఫోన్ను ఇండియాలో ప్రవేశపెట్టింది. Tecno Spark GO ఒక పెద్ద డాట్ నోచ్ డిస్ప్లే, ముందు AI సెల్ఫీ కెమేరాని ఫ్లాష్ తో అందించింది మరియు మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రొసేసరుతో వస్తుంది. అలాగే డ్యూయల్ సిమ్, మేమెరికార్డు స్లాట్ మరియు వెనుక సింగిల్ కెమెరాతో వస్తుంది.  

Tecno Spark GO

1. Tecno Spark GO (2GB + 16GB) ధర – Rs.5,499

ఈ స్మార్ట్ ఫోన్, అన్ని ఆఫ్ లైన్ ద్వారా అన్ని ప్రధాన ఔట్ లెట్లలో ఈరోజు నుండి లభిస్తుంది. అలాగే, ఈ ఫోనుతో పాటుగా రూ.799 విలువగల, ఒక బ్లూటూత్ ఇయర్ పీస్ ని ఉచితంగా ఇస్తుంది. అధనంగా, ఒక సంవత్సరం లోపు 1 టైం ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ కూడా అందిస్తోంది.         

Tecno Spark GO : ప్రత్యేకతలు

ఈ టెక్నీ స్పార్క్ గో, ఒక బడ్జెట్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది 2.0GHz క్లాక్ స్పీడ్ గల మీడియా టెక్ హీలియో A22 క్వాడ్ కోర్ ప్రొసేసరుతో వస్తుంది. ఇది ఒక 6.1-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది మరియు ఈ డిస్ప్లే  డాట్ నాచ్ డిజైనుతో ఉంది, ఇందులో సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ నెబ్యులా బ్లాక్ మరియు రాయల్ పర్పల్ కలర్ ఎంపికలతో వస్తుంది. ఇందులో, 3,000mAh బేటరీని అందించారు. 

ఆప్టిక్స్ పరంగా, ఈ టెక్నీ స్పార్క్ గో వెనుక భాగంలో కేవలం 8MP సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. అయితే, డ్యూయల్ ఫ్లాష్ మరియు AI సామర్ధ్యంతో వస్తుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమేరాని ఒక ఫ్లాష్ తో పాటుగా అందించారు. ఈ ఫోన్, 2GB ర్యామ్ మరియు 16GB అంతర్గత స్టోరేజి తో వస్తుంది. అలాగే, ఒక మేమెరికార్డు  ద్వారా 256GB వరకూ స్టోరేజిని పెంచుకునే వీలుంటుంది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :