6,000 mAh బ్యాటరీతో కేవలం రూ.8,499 ధరలో లాంచ్ అయిన టెక్నోస్పార్క్ పవర్

6,000 mAh బ్యాటరీతో కేవలం రూ.8,499 ధరలో లాంచ్ అయిన టెక్నోస్పార్క్ పవర్
HIGHLIGHTS

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ హిలియో P 22 SoC తో వస్తుంది.

టెక్నో సంస్థ, ఈరోజు భారతదేశంలో తన పవర్ ఫుల్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ అయినటువంటి, టెక్నోస్పార్క్ పవర్ ను ఒక 6,000 mAh బ్యాటరీతో తీసుకొచ్చింది. ఈ టెక్నో స్పార్క్ పవర్ యొక్క ప్రత్యేక లక్షణం దానిలోని బ్యాటరీ మరియు ట్రిపుల్ రియర్ కెమేరాగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఇది బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్, కేవలం ఈ బడ్జెట్ ధరలో అటువంటి ఒక పెద్ద బ్యాటరీని అందిస్తోంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మీడియాటెక్ హిలియో P 22 SoC తో వస్తుంది.

టెక్నో స్పార్క్ పవర్ : ధర

టెక్నో స్పార్క్ పవర్ ఫోన్ను, భారతదేశంలో కేవలం రూ .8,499 ధరతో ప్రవేశపెట్టింది. ఈ ఫోన్ యొక్క సేల్ Flipkart నుండి డిసెంబర్ 1 వ తేదికి మొదలవుతుంది. ఈ ఫోన్‌ను డాన్ బ్లూ, అల్ఫెన్ గోల్డ్ షేడ్ కలర్‌ లో లభిస్తుంది.

టెక్నో స్పార్క్ పవర్ : స్పెసిఫికేషన్స్

ఈ టెక్నో స్పార్క్ పవర్ ఆండ్రాయిడ్ 9 ఆధారంగా HiOS 5.5 పై పనిచేస్తుంది మరియు ఈ ఫోన్ ఒక 6.35-అంగుళాల HD + డిస్ప్లే ను కలిగి ఉంది, ఇది 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ కొత్త మొబైల్ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P 22 SoC యొక్క శక్తితో పనిచేస్తుంది మరియు ఇది 4GB RAM తో జత చేయబడింది.

టెక్నోస్పార్క్ పవర్ వెనుక భాగంలో, ఒక ట్రిపుల్ కెమెరాతో లాంచ్ చేయబడింది మరియు ఈ ఫోన్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను f / 2.0 ఎపర్చరుతో కలిగి ఉంది, మరియు రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ తో ఉంటుంది. ఈ కెమెరా సెటప్‌ తో టెక్నో ఒక క్వాడ్-ఎల్‌ఈడీ మాడ్యూల్‌ను కూడా జోడించింది. ఈ ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించబడింది మరియు ఈ కెమెరా 1080 P వీడియోలను 30fps వద్ద తీయగలదు.

టెక్నో స్పార్క్ పవర్, 64 జిబి ఇన్‌బిల్ట్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. అలాగే,  మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా 256 జిబి వరకు మెమోరిని పెంచుకోవచ్చు. ఇవి కాకుండా, 4G VoLTE, Wi-Fi 802.11/ac , బ్లూటూత్ v5.0, మరియు GPS / A-GPS కనెక్టివిటీ కోసం ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరం వెనుక భాగంలో యాంటీ ఆయిల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంచబడింది, దీని గురించి చుస్తే, ఈ పరికరం 0.27 సెకన్లలో పరికరాన్ని అన్‌లాక్ చేయగలదని మరియు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఫోన్‌లో చేర్చబడిందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఫోనులో ప్రధాన విషయం అయినటువంటి బ్యాటరీ విషయానికి వస్ట్, ముందుగా చెప్పినట్లుగా ఈ ఫోనులో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo