స్పెక్స్ సరిపోలిక : షావోమి రెడ్మి నోట్ 7 vs ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2

స్పెక్స్ సరిపోలిక : షావోమి రెడ్మి నోట్ 7 vs ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2
HIGHLIGHTS

షావోమి రెడ్మి నోట్ 7 ఒక 48MP వెనుక కెమెరా మరియు ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసరుతో నేటి నుండి చైనాలో అమ్మకాలను సాగిస్తోంది.

షావోమి రెడ్మి నోట్ 7 ఒక 48MP వెనుక కెమెరా మరియు ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసరుతో నేటి నుండి చైనాలో అమ్మకాలను సాగిస్తోంది. ఈ ఫోన్ షావోమి రెడ్మి నోట్ 6 కి వారసుడిగా తీసుకురాబడింది. ఈ స్మార్ట్ ఫోన్ను, ఆసుస్ జెన్ ఫోన్  మాక్స్ ప్రో M2 తో పోల్చిస్తే, ఇది భారతదేశంలో రూ .12,999 నుండి ప్రారంభమవుతుంది మరియు క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగి ఉంది, ఇది రెడ్మి నోట్ 7 వలెనే ఉంటుంది. అయితే, రెండు పరికరాల మధ్య తేడాలను సరిగ్గా అర్థం చేసుకోవడానికి స్పెక్స్ లను  సరిపోల్చిచూద్దాం.

Redmi Note 7 vs Max pro M2.png

షావోమి రెడ్మి నోట్ 7, ఒక 6.3 అంగుళాల డిస్ప్లేతో ఉంటుంది, ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 ఒక 6.26-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. రెడ్మి నోట్ 7, 2340 x 1080 పిక్సెల్స్ యొక్క మెరుగైన రిజల్యూషన్ను అందిస్తుంది, అయితే ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2, కొంచెం తక్కువగా 2280 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది.

ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ మెమెరీతో జతచేయబడ్డాయి. కెమెరాల విభగానికి వస్తే, షావోమి యొక్క ఈ తాజా డివైజ్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో 48MP వెనుక కెమెరాగా చెప్పవచ్చు, ఇది 5MP డెప్త్ సెన్సారుతో కలిసి ఉంటుంది. ముందు, ఒక 16MP AI ఆధారిత సెన్సార్ ఉంటుంది. మరొక వైపు, ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2, ముందుభాగంలో 13MP యూనిట్ మరియు వెనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరా ఉంది.  

షావోమి రెడ్మి నోట్ 7 ఇంకా భారతదేశంలో విడుదలవ్వలేదు. అయినప్పటికీ, ఈ ఫోన్ ఇప్పటికే చైనాలో విక్రయించబడుతోంది కాబట్టి అది త్వరలో భారతదేశానికి రాగల అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, ఆసుస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 భారతదేశంలో 12,999 రూపాయల ధర నుండి ప్రారంభమవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo