స్పెసిఫికేషన్స్ సరిపోలిక : రియల్మీ U1vs హానర్ 8C

HIGHLIGHTS

ఇటీవలే విడుదలై అమ్మకానికి సిద్దమవుతున్న ఈ రెండు ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

స్పెసిఫికేషన్స్ సరిపోలిక : రియల్మీ U1vs హానర్ 8C

రియల్మీ యొక్క U సిరీస్లో నుండి వచ్చిన మొట్టమొదటి ఫోన్ రియల్మీU1, ఇది మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వస్తుంది మరియు ఈ ప్రాసెసరుతో వచ్చిన  మొట్టమొదటి ఫోనుకూడ ఈ "రియల్మీ U1". దీని 3 GB / 32 GB వేరియంట్ యొక్క ధర రూ .11,999. మరొకవైపున, హానర్ 8C ని చుస్తే, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ తో వస్తుంది మరియు ఈ ఫోనుకూడా రూ. 11,999 ధరకే లభిస్తుంది. కాబట్టి,  ఈ రెండు ఫోన్లలో సరైన స్పెక్స్ తెలుకోవడానికి వీలుగా,  వీటిని సరిపోల్చి చూద్దాం. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

RealMe U1 vs Honor 8C.png

రియల్మీ U1 ఒక 6.3-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది, అయితే హానర్ 8C, 720 x 1520 పిక్సల్స్ యొక్కరిజల్యూషన్ అందించే కొద్దిగా చిన్నదైన ఒక 6.2-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. డిస్ప్లే పరంగా, పేపర్ పైన కనిపించే విధంగా చుస్తే రియల్మీ U1 హానర్ 8C కంటే కొంచెం పెద్దదిగా మరియు మెరుగైన డిస్ప్లే కలిగివుంది.

 ప్రాసెసర్ విషయానికి వచ్చినప్పుడు, ఈ రియల్మీ U1 ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ చేత శక్తిని కలిగి ఉంటుంది, అలాగే ఈ హానర్ 8C క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది.

కెమెరా విభాగానికివస్తే, ఈ రియల్మీ U1 డ్యూయల్ 13MP + 2MP వెనుక కెమెరా మరియు 25MP ముందు కెమెరా కలిగి ఉంది. హానర్ 8C వెనుకవైపు ఒక డ్యూయల్ 13MP + 2MP కెమెరా సెటప్ మరియు  8MP ముందు కెమేరాతో అమర్చబడి ఉంటుంది.

రియల్మీ U1 మరియు హానర్ 8C రెండూ కూడా భారతదేశంలో రూ .11,999 ధరతో అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ నుండి డిసెంబర్ 10న ఈ హానర్ 8C అందుబాటులో ఉంటుంది మరియు అదేతేది అయిన డిసెంబర్ 5 న అమెజాన్ నుండి మీకు RealMe U1 కూడా అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo