స్పెక్స్ సరిపోలిక : ఒప్పో R17 vs శామ్సంగ్ గెలాక్సీ A9

HIGHLIGHTS

ఒకటేమో ట్రిపుల్ కెమెరా ఫోన్ మరొకటి క్వాడ్ కెమేరా ఫోన్, రెండింటిని పోల్చిచూద్దాం!

స్పెక్స్ సరిపోలిక : ఒప్పో R17 vs శామ్సంగ్ గెలాక్సీ A9

ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు డిస్ప్లేలో వేలిముద్ర సెన్సారుతో Oppo R17 ప్రో భారతదేశంలో విడుదలచేయబడింది. మరొక వైపు, శామ్సంగ్ గెలాక్సీ A9 కూడా 
ప్రపంచంలో క్వాడ్(నాలుగు) రియర్ కెమెరా సెటప్ కలిగిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఈ రెండు తాజా ప్రీమియం మధ్యస్థాయి పరికరాలు మనకి గొప్ప ప్రత్యేకతలతో వస్తాయి, కానీ వీటి హార్డ్వేరుకు వచ్చినప్పుడు ఉత్తమమైనవేనా? తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

డిస్ప్లే 

Oppo R17 ప్రో ఒక 6.4-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 19: 9 యొక్క యాస్పెక్ట్ రేషియాతో మరియు 91.5% స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్, దీని స్క్రీన్ పైన ఒక టియర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది మరియు దీనిలో  కెమెరాను  కలిగివుంటుంది. ఇది డిస్ప్లే లో- వేలిముద్ర సెన్సార్ కలిగివుంది. ఈ పరికర డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ద్వారా రక్షించబడింది.

ఇక శామ్సంగ్ గెలాక్సీ A9 చూస్తే, ఇది 1080 x 2220 పిక్సల్స్ అందించే కొంచెం చిన్నదైన  ఒక 6.2-అంగుళాల సూపర్ AMOLED ఇన్ఫినిటీ డిస్ప్లే ని కలిగివుంటుంది. దీనికి మార్కెట్లోని ఇతర తాజా స్మార్ట్ ఫోన్లలాగా డిస్ప్లే పైన నోచ్ లేదు. అలాగే, వేలిముద్ర సెన్సార్ కూడా వెనుక భాగంలో ఉంచుతారు.

కెమెరా

Oppo R17 ప్రో వెనుకవైపు ఏర్పాటు చేసిన ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంది, ఇది ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటి. ఇది 12MP ప్రాధమిక సెన్సార్, 20MP సెకండరీ సెన్సార్ మరియు ఒక TOF సెన్సార్ను కలిగి ఉంది,  ఇది మ్యాపింగ్ అబ్జక్షన్ కోసం, ఇది 3D మ్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగించబడుతుంది. ముందు, పరికరం 25MP సెల్ఫీ కెమేరా  కలిగి ఉంటుంది.

శామ్సంగ్ గెలాక్సీ A9 ఒక క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఇది 24MP ప్రాధమిక కెమెరా, 8MP వైడ్ -యాంగిల్  కెమెరా, 5MP డెప్త్ సెన్సింగ్ కెమెరా మరియు 10MP టెలిఫోటో కెమెరా కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్  ముందుభాగంలో 20MP యూనిట్ ఉంటుంది.

ప్రాసెసర్

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్తో లభించే మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా Oppo R17 ప్రో ఉంది, ఇది 8GB RAM మరియు 128GB స్టోరీజితో వస్తుంది, కానీ మైక్రో SD కార్డుతో విస్తరించే వీలులేదు.

మరోవైపు, శామ్సంగ్ తన పాత  6000 సిరీస్ లో వాడిన  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ చేత ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎ 9 శక్తినిచ్చింది. 512GB వరకు మైక్రో SD కార్డు ద్వారా విస్తరించదగిన 6GB RAM మరియు 128GB స్టోరేజి కలిగి ఫోన్ వస్తుంది.

బ్యాటరీ

ఒప్పోR17 ప్రో 3,700mAH బ్యాటరీని వేగవంతంగా ఛార్జింగుకు మద్దతిస్తుంది. ఇది కేవలం 10 నిమిషాల ఛార్జింగుతో 40% వరకు స్మార్ట్ ఫోన్ను ఛార్జ్ చేయగల,  సంస్థ యొక్క సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది.

శ్యామ్సంగ్ గెలాక్సీ A9 3,800mAH బ్యాటరీతో  వేగవంతంమైన ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది.

ఒప్పోR17 యొక్క  8GB / 128GB వేరియంట్ ధర రూ .45,999 కాగా,  శ్యామ్సంగ్ గెలాక్సీ A9 యొక్క 6GB RAM వేరియంట్ ధర రూ .36,990 మరియు  దాని 8GB వేరియంట్ రూ 39,990.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo