Sony Xperia 1 సూపర్ కెమేరా మరియు 4K OLED తో రానుంది

Updated on 08-Jul-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 21:9 ఆస్పెక్ట్ రేషియో కలిగిన ఒక 4K OLED డిస్ప్లేతో ఉండనుంది.

సోని ఎక్స్పీరియా 1 స్మార్ట్ ఫోన్ను తీసుకురానున్నట్లు సంస్థ ప్రకటించిన చాలాకాలం తరువాత ఈ ఫోన్ యొక్క వివరాలలు ఇప్పుడు బయటికొచ్చాయి. XDA డెవోలపర్స్ దీనికి సంభంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియో మరియు కధనాన్ని ముందుగా ప్రచురించింది. ఈ నివేధిక ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ ఒక ప్రత్యేకమైన మరియు పొడవైన 4K OLED డిస్ప్లేతో వుడనునట్లు తెలుస్తోంది. అంటే, ముందుగా వచ్చినటువంటి సోనీ 10 సిరీస్ ఫోన్ల మాదిరిగానే, ఇది కూడా పొడవుగా ఉండనుంది.

ఇక పొడవుగా వుండే ఈ స్మార్ట్ ఫోన్ ఒక 21:9 ఆస్పెక్ట్ రేషియో కలిగిన ఒక 4K OLED డిస్ప్లేతో ఉండనుంది. అయితే, దీని UI ద్వారా 4K వీడియోలు నేరుగా ప్లే చేరాలేకపోయిన మనం కంటెంట్ ప్లే చేస్తున్నపుడు ఆటొమ్యాటిగా 4K రిజల్యూషనుకు మారుతుంది. ఇక కెమేరా విభాగానికి వస్తే, XDA డెవలపర్స్ దీనికి సంబంధిన పూర్తి వివరాలను అందించింది.

ఈ నివేదిక ప్రకారం, ఈ ఫోన్ 12MP+12MP+12MP ట్రిపుల్ రియర్ కెమేరాతో ఉంటుంది. ఇందులో ఒక 12MP 26mm వైడ్ యాంగిల్ కెమేరా, మరొక 12MP 52mm టెలిఫోటో కెమేరా మరియు మరొక 12MP 16mm సూపర్ వైడ్ యాంగిల్ కెమేరాలతో కలగలిపిన ట్రిపుల్ కెమేరా సెటప్పుతో ఉంటుంది. ఇక ముందుభాగంలో, సెల్ఫీల కోసం ఒక 8MP సెల్ఫీ కెమేరాను కలిగి ఉంటుంది.  అలాగే, ఇందులో 3,330 mAh బ్యాటరీ మరియు ఆడియో పరంగా Dolby Atmos,  Hi – Res ఆడియో మరియు మరిన్ని ఫీచర్లతో ఉంటుంది. అంతేకాదు, ఇది IP65/68 సర్టిఫికేషన్ తో వస్తుంది కాబట్టి వాటర్ రెసిస్టెన్స్ తో ఉంటుంది.       

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :