శామ్సంగ్ గెలాక్సీ A9 మరియు గెలాక్సీ A7 పైన భారతదేశంలో ధర తగ్గింపు

శామ్సంగ్ గెలాక్సీ A9 మరియు గెలాక్సీ A7 పైన భారతదేశంలో ధర తగ్గింపు
HIGHLIGHTS

శామ్సంగ్ తన గెలాక్సీ ఏ 7 (2018), గెలాక్సీ ఎ 9 (2018) స్మార్ట్ ఫోన్ల పైన, ఇండియాలో డిస్కౌంట్ అందిస్తోంది.

ముఖ్యాంశాలు:

1. శామ్సంగ్ గెలాక్సీ ఎ 7 మరియు గెలాక్సీ A9 స్మార్ట్ఫోన్లు ఇప్పుడు భారతదేశంలో డిస్కౌంట్ అందుకున్నాయి.

2. గెలాక్సీ A7 ఇప్పుడు 18,990 రూపాయల వద్ద మొదలవుతుంది.

3. గెలాక్సీ A9 ఇప్పుడు రూ. 33,990 వద్ద మొదలవుతుంది.

శామ్సంగ్ తన గెలాక్సీ ఏ 7 (2018), గెలాక్సీ ఎ 9 (2018) స్మార్ట్ ఫోన్ల పైన, ఇండియాలో డిస్కౌంట్ అందిస్తోంది. ఆఫ్ లైన్ రిటైలర్ మహేష్ టెలికాం ఈ వార్తను ట్వీట్ చేస్తూ, ఈ కొత్త హ్యాండ్సెట్లను ఆన్లైన్లో కూడా రాయితీ ధరలలో విక్రయిస్తున్నారు. శామ్సంగ్ గెలాక్సీ A7 యొక్క 4GB RAM / 64GB స్టోరేజి వేరియంట్ యొక్క లాంచ్ ధర రూ. 23,990 కాగా, ఇప్పుడు రూ .18,990 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క 6GB RAM మోడల్ ని రూ. 28,990 ధరతో విడుదల చేసింది, కానీ అది ఇప్పుడు రూ. 22,990 కి అందుబాటులో ఉంటుంది . గెలాక్సీ A9 విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 6GB మరియు 8GB RAM మోడళ్లలో 128GB స్టోరేజి కలిగి ఉంది మరియు ఇది వరుసగా రూ.36,990 మరియు రూ. 39,990 ధరలతో ప్రారంభించబడింది. అయితే, 6GB RAM వేరియంట్ ఇప్పుడు రూ. 33,990 వద్ద మరియు దాని 8GB RAM మోడల్ రూ .36,990 వద్ద అందుబాటులో ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ A9 (2018) స్పెక్స్:

శామ్సంగ్ గెలాక్సీ A9 ఒక 6.3 అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ డిస్ప్లేతో 18.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 SoC చేత శక్తినివ్వబడినది మరియు ముందు పేర్కొన్నట్లుగా, 128GB అంతర్గత మెమొరీతో  6GB మరియు 8GB RAM ఎంపికలలో లభిస్తుంది. ఈ డివైజ్ యొక్క హైలైట్ దాని నాలుగు వెనుక-కెమెరా సెటప్, ఇది f / 1.7 ఎపర్చరుతో ఒక 24MP ప్రాధమిక సెన్సార్ను కలిగి ఉంటుంది, ఇది ఒక f / 2.4 ఎపర్చర్ మరియు 2x ఆప్టికల్ జూమ్తో ఒక 10MP టెలిఫోటో సెన్సార్, ఒక 8-MP ఆల్ట్రా-వైడ్ సెన్సార్ F / 2.4 ఎపర్చరుతో 120-డిగ్రీ ఫీల్డ్ వ్యూ, చివరకు ఒక 5MP డెప్త్  సెన్సార్ f / 2.2 ఎపర్చరుతో కలిగివుంటుంది. ముందు, గెలాక్సీ A9 (2018) ఒక f / 2.0 ఎపర్చరుతో 24MP సెన్సార్ను అమలుచేస్తుంది. ఇది వెనుకవైపు ఉన్న వేలిముద్ర సెన్సార్ను కలిగి ఉంది మరియు వేగవంతమైన ఛార్జింగుకు మద్దతు ఇచ్చే 3800mAh బ్యాటరీతో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ A7 (2018) స్పెక్స్:

శామ్సంగ్ గెలాక్సీ A7 ఒక 6.5 అంగుళాల పూర్తి HD + సూపర్ AMOLED ఇన్ఫినిటీ డిస్ప్లేను 18.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో కలిగి ఉంది. ఇది ఒక శామ్సంగ్ Exynos 7885 SoC తో నడుస్తుంది మరియు 4GB మరియు 6GB RAM నమూనాలలో వస్తుంది. ఒక 24MP ఆటోఫోకస్ సెన్సార్ మరియు  f / 1.7 ఎపర్చరు, ఒక f / 2.4 ఎపర్చరుతో 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ మరియు ఇది ఒక F / 2.2 ఎపర్చరు 5MP డెప్త్-సెన్సరుతో,  ఒక ట్రిపుల్-రేర్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది, . ముందు, గెలాక్సీ A7 (2018) ఒక f / 2.0 ఎపర్చరు మరియు ఒక LED ఫ్లాష్ తో 24MP ఫిక్స్డ్ -ఫోకస్ కెమెరా సెన్సారుతో ఉంటుంది . ఈ డివైజ్  3300mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo