Tablet Deals: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన బెస్ట్ టాబ్లెట్ డీల్స్ కోసం చూస్తుంటే ఈ డీల్స్ చెక్ చేయండి.!
పెద్ద స్క్రీన్ మరియు మంచి ఫీచర్స్ కలిగిన టాబ్లెట్ చక్కగా ఉపయోగపడతాయి
మంచి టాబ్లెట్ ఎంచుకోవడం కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది
మంచి ఫీచర్స్ తో లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్ డీల్స్ వివరాలు ఇక్కడ అందించాము
Tablet Deals: మీ పిల్లలకు చదువు లేదా మీ ఇంట్లో పెద్ద వారికి ఎంటర్టైన్మెంట్ లేదా ఫ్యామిలీ కోసం పెద్ద స్క్రీన్ మరియు మంచి ఫీచర్స్ కలిగిన టాబ్లెట్ చక్కగా ఉపయోగపడతాయి. అయితే, మంచి టాబ్లెట్ ఎంచుకోవడం కోసం చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఫీచర్స్, డిజైన్ మరియు ప్రైస్ వంటి పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక మంచి టాబ్లెట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే, మీకు ఎటువంటి శ్రమలేకుండా బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ తో లభిస్తున్న బెస్ట్ టాబ్లెట్ డీల్స్ వివరాలు ఇక్కడ అందించాము. ఇక్కడ అందించిన బెస్ట్ టాబ్లెట్ డీల్స్ లో ఒక మంచి టాబ్లెట్ డీల్ ను మీరు ఎంచుకోవచ్చు.
SurveyTablet Deals: ఏమిటి ఈ బెస్ట్ డీల్స్?
భారత మార్కెట్లో ప్రస్తుతం మొబైల్ మరియు టాబ్లెట్ ధరలు పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ పెరిగిన ధరల రోజుల్లో కూడా కొన్ని బెస్ట్ డీల్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. వాటిలో మూడు బెస్ట్ డీల్స్ వివరాలు ఇక్కడ అందిస్తున్నాము. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆ డీల్స్ ఏమిటో చూద్దామా.
REDMI Pad 2
ఇది షియోమీ అందించిన లేటెస్ట్ అండ్ బెస్ట్ బడ్జెట్ టాబ్లెట్. ఇది ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ రూ. 16,999 రూపాయల ప్రారంభ ధరలో లభిస్తోంది. అయితే, ఈ టాబ్లెట్ LTE + Wi-Fi టాబ్లెట్ కూడా కేవలం రూ. 19,999 ధరలో షియోమీ సైట్ నుండి లభిస్తోంది. ఈ ప్రైస్ లో ఈ టాబ్లెట్ బెస్ట్ ఫీచర్స్ కలిగిన బెస్ట్ టాబ్లెట్ గా చాలా మంచి రివ్యూలు అందుకుంది. ఇది 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ ని 2.5k రిజల్యూషన్ మరియు 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఇది క్వాడ్ స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్ మరియు 9000 mAh బిగ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది.

MOTOROLA Pad 60 Neo
ఈ మోటోరోలా పాడ్ 60 నియో టాబ్లెట్ ప్రస్తుతం రూ. 20,499 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ టాబ్లెట్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం రూ. 19,249 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ టాబ్లెట్ కూడా 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ ను 2.5k రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ టాబ్లెట్ బాక్స్ తో పాటు మోటో పెన్ కూడా వస్తుంది. ఈ పెన్ తో మీ పిల్లలు డ్రాయింగ్, రైటింగ్ మరియు మరిన్ని పనులు చాలా ఈజీగా చేయొచ్చు.
Also Read: QLED Smart Tv deal: కేవలం రూ. 24,000 రూపాయల ఆఫర్ ధరలో 50 ఇంచ్ అందుకోండి.!
OPPO Pad SE
ఇది ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన లేటెస్ట్ 11 ఇంచ్ టాబ్లెట్ మరియు ఈ టాబ్లెట్ బేసిక్ వేరియంట్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 16,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. ఈ టాబ్లెట్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 9,340 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఇందులో FHD రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 11 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. ఇది మీడియాటెక్ హీలియో G 100 ఆక్టాకోర్ ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు 4GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది.
ఈ మూడు టాబ్లెట్స్ కూడా బడ్జెట్ ధరలో మంచి పెర్ఫార్మెన్స్ అందించే టాబ్లెట్ డీల్స్ గా చెప్పబడతాయి. మీరు పెన్ తో వచ్చే టాబ్లెట్ కోరుకుంటే మోటోరోలా పాడ్, కాలింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం అయితే రెడ్ టాబ్లెట్ మరియు మీరు ఎక్కువ సమయం బ్యాటరీ బ్యాకప్ అండ్ ఫాస్ట్ ఛార్జ్ కోరుకుంటే ఒప్పో టాబ్లెట్ ను పరిశీలించవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
