రేపు లాంచ్ కాబోతున్న Galaxy M13 మరియు M13 5G స్మార్ట్ ఫోన్లు..!!

రేపు లాంచ్ కాబోతున్న Galaxy M13 మరియు M13 5G స్మార్ట్ ఫోన్లు..!!
HIGHLIGHTS

శామ్సంగ్ Galaxy M సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది

ఈ స్మార్ట్ ఫోన్లలో ఒకటి 4G మోడల్ కాగా, మరొకటి 5G మోడల్

ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్ లను శామ్సంగ్ వెల్లడించింది

శామ్సంగ్ తన బడ్జెట్ సిరీస్ Galaxy M సిరీస్ నుండి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్లలో ఒకటి 4G మోడల్ కాగా, మరొకటి 5G మోడల్. ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో కూడా పెద్ద బ్యాటరీ, ర్యామ్ ప్లస్ ఫీచర్ మరియు ఆటో డేటా స్వింగ్ వంటి మరిన్ని ఫీచర్లను అందించినట్లు శామ్సంగ్ చెబుతోంది. ఈ ఫోన్లను రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో విడుదల చేయడానికి డేట్ మరియు టైం ఫిక్స్ చేసింది. ఈ ఫోన్ కోసం Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ను కూడా అందించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ల ఎటువంటి ఫీచర్లతో రాబోతున్నాయో తెలుసుకుందాం.

ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్ లను శామ్సంగ్ వెల్లడించింది. దీని ప్రకారం, శామ్సంగ్ Galaxy M13 4G మోడల్ ట్రిపుల్ కెమెరాతో ఉంటే, Galaxy M13 5G మోడల్ మాత్రం వెనుక డ్యూయల్ కెమెరాలతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ముందు భాగం మాత్రం ఒకేవిధంగా కనిపిస్తోంది. శామ్సంగ్ గెలాక్సీ ఎం13 4G మోడల్ 6,000 mAh హెవీ బ్యాటరీని కలిగి ఉంటే, శామ్సంగ్ గెలాక్సీ ఎం13 5G మాత్రం 5,000 mAh బ్యాటరీతో వస్తుంది.

ఇక ఈ రెండు ఫోన్లలో అందించిన మరొక ఫీచర్ విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ ఎం13 4G మరియు 5G, రెండు మోడళ్లలో కూడా ర్యామ్ ప్లస్ (RAM+) ఫీచర్ ని జతచేసినట్లు కూడా పేర్కొంది. ఈ ఫోన్ లలో అందించిన ఈ ఫీచర్ తో మల్టీ యాప్స్ ను కూడా హ్యాండిల్ చేయగలిగేలా 12GB ర్యామ్ వరకూ శక్తిని ఇస్తుందని టీజర్ ద్వారా తెలిపింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo