Samsung Galaxy M16 మరియు M06 లాంచ్ అనౌన్స్ చేసిన శామ్సంగ్.!
Samsung Galaxy M16 మరియు M06 ఫోన్ లను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం శామ్సంగ్ టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది
M సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల చేయడానికి సిద్ధమయ్యింది
శామ్సంగ్ ఇండియాలో Samsung Galaxy M16 మరియు M06 ఫోన్ లను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం శామ్సంగ్ టీజింగ్ ను కూడా మొదలు పెట్టింది. రీసెంట్ గా గెలాక్సీ F సిరీస్ నుంచి 10 వేల కంటే తక్కువ బడ్జెట్ లో F06 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన శామ్సంగ్ ఇప్పుడు మరో బడ్జెట్ సిరీస్ M సిరీస్ నుంచి రెండు కొత్త ఫోన్లు విడుదల చేయడానికి సిద్ధమయ్యింది.
SurveySamsung Galaxy M16 మరియు M06 : లాంచ్
శామ్సంగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గెలాక్సీ M16 మరియు M06 స్మార్ట్ ఫోన్ లను ఎప్పుడు లాంచ్ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు. Coming Soon ట్యాగ్ లైన్ తో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి శామ్సంగ్ టీజింగ్ స్టార్ట్ చేసింది. ఈ ఫోన్స్ లాంచ్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజింగ్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. అంయితే, అమెజాన్ ఇండియా ఈ సిరీస్ కోసం ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది అని అర్థం అవుతోంది.
Also Read: Sony Bravia 3 Series స్మార్ట్ టీవీల పై అమెజాన్ బిగ్ డీల్స్.!
Samsung Galaxy M16 మరియు M06 : ఫీచర్స్
శామ్సంగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఎటువంటి ఇతర వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా గెలాక్సీ M06 ఫోన్ డ్యూయల్ కెమెరాతో మరియు శామ్సంగ్ గెలాక్సీ M16 స్మార్ట్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ కావచ్చని అనిపిస్తుంది.

అంతేకాదు, ఈ ఫోన్స్ లాంచ్ కోసం కంపెనీ అందించిన క్యాప్షన్ ను బట్టి ఈ రెండు ఫోన్లు కూడా ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగి ఉంటాయి అనే అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ ఫోన్లకు ‘Can’t Beat The Master’ అనే ట్యాగ్ లైన్ అందించింది. అంటే, ఈ సెగ్మెంట్ లో మంచి ఫీచర్స్ కలిగిన గొప్ప పోటీదారు గా ఫోన్ లను అందించవచ్చని అంచనా వేస్తున్నారు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
