Samsung Galaxy A57 5G మరియు Galaxy A37 5G రెండు ఫోన్లు లాంచ్ చేసిన శాంసంగ్.!
Samsung Galaxy A57 5G మరియు Galaxy A37 5G ఫోన్లు శాంసంగ్ విడుదల చేసింది
AI ఫీచర్స్ తో ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో అందించింది
ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు బిగ్ బ్యాటరీ సెటప్ కూడా కలిగి ఉంటాయి
Samsung Galaxy A57 5G మరియు Galaxy A37 5G రెండు ఫోన్లు ఈరోజు శాంసంగ్ ఇండియాలో విడుదల చేసింది. లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ మరియు AI ఫీచర్స్ తో ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఇండియన్ మార్కెట్లో అందించింది. అంతేకాదు ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు బిగ్ బ్యాటరీ సెటప్ కూడా కలిగి ఉంటాయి.
SurveySamsung Galaxy A57 5G మరియు A37 5G : ఫీచర్స్
సాంసంగ్ గెలాక్సీ ఏ57 మరియు సాంసంగ్ గెలాక్సీ ఏ37 రెండు స్మార్ట్ ఫోన్లు కూడా FHD రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ స్క్రీన్ కలిగి ఉంటాయి. అయితే, ఏ57 ఫోన్ సూపర్ AMOLED+ స్క్రీన్ కలిగి ఉంటే సూపర్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. కానీ ఈ రెండు ఫోన్లు కూడా 120Hz రిఫ్రెష్ రేట్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. వీటిలో ఏ37 ఫోన్ 7.4mm మందంతో ఉంటే ఏ57 ఫోన్ మాత్రం 6.9mm మందంతో మరింత స్లీక్ గా ఉంటుంది.
శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. అయితే, వీటిలో స్వల్పమైన వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే, ఏ57 ఫోన్ లో 12MP అల్ట్రా వైడ్ + 50MP మెయిన్ + 5MP మాక్రో కెమెరా సెటప్ ఉంటే, ఏ37 ఫోన్ లో మాత్రం 8MP అల్ట్రా వైడ్ + 50MP మెయిన్ + 5MP మాక్రో కెమెరా సెటప్ ఉంటుంది. అయితే, ఈ రెండు ఫోన్లు కూడా 12MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఆటో ట్రిమ్, ఫిల్టర్ అండ్ ఎడిట్ సజెషన్, ఆబ్జెక్ట్ ఎరేజర్ మరియు మరిన్ని AI ఫీచర్స్ కలిగి ఉంటాయి.
ఇక బ్యాటరీ ఫీచర్ విషయానికి వస్తే, ఈ రెండు కొత్త స్మార్ట్ ఫోన్లలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని శాంసంగ్ అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. అంతేకాదు ఈ రెండు ఫోన్లు కూడా IP68 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫోన్స్ గా ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు శాంసంగ్ యొక్క లేటెస్ట్ One UI 8.5 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు ఆరు సంవత్సరాల ఓఎస్ అప్‌గ్రేడ్ మరియు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుకుంటాయి. ఈ ఫోన్స్ కూడా Samsung Knox సెక్యూరిటీ ఫీచర్స్ కలిగి ఉంటాయి.
Also Read: Vivo Y21 5G మరియు Vivo Y11 5G రెండు కొత్త ఫోన్లు లాంచ్ చేసిన వివో.!
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile